Home> వినోదం
Advertisement

Bro Movie Runtime: బ్రో సినిమా రన్‌టైమ్ మరీ అంత తక్కువనా, కారణాలేంటి

Bro Movie Runtime: పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రో సినిమాపై కీలకమైన అప్‌డేట్ వెలువడింది. సినిమా రన్‌టైమ్ విషయంలో వెలువడిన ఈ అప్‌డేట్ కొంతమందిని నిరాశపరుస్తుంటే మరికొంతమంది మాత్రం మంచిదే అంటున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..

Bro Movie Runtime: బ్రో సినిమా రన్‌టైమ్ మరీ అంత తక్కువనా, కారణాలేంటి

Bro Movie Runtime: సాయి థరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. జూలై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా రన్‌టైమ్ ఎంతే తేలిపోయింది. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఫిక్స్ చేసిన రన్‌టైమ్‌పై పెదవి విరుస్తున్నారు.

తమిళ సూపర్ హిట్ సినిమా వినోదయ సీతమ్‌కు రీమేక్‌గా తెలుగులో మల్టీస్టారర్ చిత్రంగా బ్రో తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, ఊర్వశీ రౌతేలాలు నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరోవైపు సినిమా రన్‌టైమ్ ఫిక్సైంది. 2 గంటల 10 నిమిషాలు ఈ సినిమా ఉంటుంది. రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా రన్‌టైమ్ ఇంత తక్కువగా పెట్టడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. మల్టీ స్టారర్ సినిమాకు ఇంత తక్కువ రన్‌టైమ్ అంటే అసలు చూసినట్టే ఉండదనేది చాలామంది అభిప్రాయం. దీనికితోడు బ్రో సినిమాలో జానవులే పాటపై కూడా చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పాటను తీసేయమని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్నా ప్రమోషన్లు సరిగ్గా లేకపోవడంపై అభిమానుల్నించి ఆగ్రహం వ్యక్తమౌతోంది.

అదే సమయంలో బ్రో సినిమా రన్‌టైమ్‌ను 130 నిమిషాలకు లాక్ చేయడం మంచి నిర్ణయమేనని వాదించేవాళ్లు కూడా లేకపోలేదు. రన్‌టైమ్ తక్కువగా ఉంటే అదనపు షోలు ప్లాన్ చేసుకునేందుకు వీలుంటుందని, ప్రేక్షకులకు కూడా తగిన సౌకర్యం కలుగుతుందనేది కొందరి వాదన. అంటే తక్కువ రోజుల్లో ఎక్కువ షోలతో కలెక్షన్లు పెంచుకోవచ్చనేది మరో వాదన. అన్నింటికీ మించి బ్రో సినిమా రన్‌టైమ్ తక్కువగా ఉండటం వల్ల సినిమా యావరేజ్ టాక్ ఉన్నా..ప్రేక్షకులకు బోర్ అన్పించకుండా ఉంటుందని చెబుతున్నారు. 

Also read: Rangasthalam in Japan: జపాన్‌లో భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్న రంగస్థలం, చెర్రీ క్రేజ్ మామాలుగా లేదుగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More