Home> వినోదం
Advertisement

Bellamkonda Ganesh's Swathimuthyam: 'స్వాతి ముత్యం' మీద అంత నమ్మకమా.. ఇద్దరు సీనియర్ హీరోలతో పోటీ.. ఇప్పుడు మరో సంచలనం!

Paid Premiers for Bellamkonda Ganesh's Swathimuthyam Movie:  స్వాతిముత్యం సినిమా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 4వ తేదీ రాత్రి కొన్ని పెయిడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Bellamkonda Ganesh's Swathimuthyam: 'స్వాతి ముత్యం' మీద అంత నమ్మకమా.. ఇద్దరు సీనియర్ హీరోలతో పోటీ.. ఇప్పుడు మరో సంచలనం!

Paid Premiers for Bellamkonda Ganesh's Swathimuthyam Movie: బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఎంత పాపులారిటీ సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నట వారసుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను అనే సినిమాతో రంగంలోకి దిగాడు. అయితే ఆయన ఇప్పటికీ సరిగా హిట్టు కొట్టలేనే చెప్పాలి. రాక్షసుడు సినిమాతో మొట్టమొదటి సక్సెస్ అందుకున్న ఆయన వెంటనే బాలీవుడ్ కి వెళ్లాలనే ప్రయత్నంలో ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

వివి వినాయక్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే పూర్తయింది. కానీ సరైన రిలీజ్ డేట్ అలాగే బాలీవుడ్ లో థియేటర్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆయన బాలీవుడ్ కి వెళితే తన తమ్ముడిని టాలీవుడ్ లో పరిచయం చేస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ హీరోగా స్వాతిముత్యం అనే సినిమా రూపొందింది. ప్రఖ్యాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ సినిమాకు సహానిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని అక్టోబర్ 5వ తేదీన దసరా సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు వాస్తవానికి అక్టోబర్ 5వ తేదీన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. సాధారణంగా అయితే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు చిన్న సినిమాలు వాయిదా వేసుకోవడం కనిపిస్తూ ఉంటుంది.

కానీ ఇక్కడ మాత్రం స్వాతిముత్యం సినిమాని వాటితో పాటే రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సినిమా యూనిట్ నుంచి మరో ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 4వ తేదీ రాత్రి కొన్ని పెయిడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్న మేకర్స్ మౌత్ టాక్ ద్వారా సినిమాని మరింత ముందుకు తీసుకు వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

సాధారణంగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద రూపొందే ఏ సినిమా అయినా స్క్రిప్ట్ త్రివిక్రమ్ ఫైనల్ చేసిన తర్వాతే సెట్స్ మీదకు వెళుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా త్రివిక్రమ్ చూసి ఫైనల్ చేసిన తర్వాతే సెట్స్ మీదకు వెళ్ళింది. మునుపెన్నడూ లేని విధంగా తన భార్యను ఈ సినిమాలో సహనిర్మాతగా వ్యవహరింప చేయడం చూస్తుంటే త్రివిక్రమ్ ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారనే చెప్పాలి. గాడ్ ఫాదర్ కానీ ది ఘోస్ట్ సినిమా కానీ అంచనాలను అందుకోలేని పరిస్థితుల్లో స్వాతిముత్యం దసరాకు కచ్చితంగా హిట్టు కొడుతుందని నమ్మకంతో త్రివిక్రమ్ టీం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి ఈ దసరాకి స్వాతి ముత్యం ఎంతమందిని మెప్పించబోతున్నాడు అనేది.

Also Read: Manchu Vishnu: దీపావళి కానుకగా జిన్నా సినిమా, సినీ పరిశ్రమ విడిపోవడానికి కారణం మీడియానే

Also Read: Lunch Menu Viral: వేల కిలోల మటన్, చికెన్, రొయ్యలు, చేపలు..కృష్ణంరాజు సంస్మరణ సభలో కళ్లు చెదిరే వంటకాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More