Home> వినోదం
Advertisement

Oscar 2022 Nominations: ఆస్కార్ 2022 నామినేషన్స్‌కి పోటీపడుతున్న చిత్రాల్లో జై భీమ్

Oscar 2022 Nominations list announcement: హాలీవుడ్ నుంచి ట్రెసీ ఎలిస్ రోజ్, లెస్లీ జోర్డాన్ ఆస్కార్ 2022 నామినేషన్స్ షోను హోస్ట్ చేయనున్నారు. భారత్ నుంచి ఆస్కార్ 2022 నామినేషన్స్‌కి పోటీపడుతున్న చిత్రాల జాబితాలో జై భీమ్, మరక్కార్: లయన్స్ ఆఫ్ ది అరేబియన్ సీ, ఇండియా స్వీట్స్ అండ్ స్పైసెస్ వంటి చిత్రాలు ఉన్నాయి.

Oscar 2022 Nominations: ఆస్కార్ 2022 నామినేషన్స్‌కి పోటీపడుతున్న చిత్రాల్లో జై భీమ్

Oscar 2022 Nominations list announcement: ఆస్కార్ 2022 నామినేషన్స్ ప్రకటనకు వేళయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు మాత్రమే కాకుండా యావత్ ఆడియెన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే అకాడమి అవార్డులకు పోటీపడబోతున్న చిత్రాల జాబితా ఇంకాసేపట్లో విడుదల కానుంది. ఈ జాబితాలో చిత్రాల పేర్లతో పాటు ఆయా చిత్రాల్లో నటించిన నటీనటులు, ఆయా చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్స్, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల పేర్లు కూడా వెల్లడించనున్నారు.  

హాలీవుడ్ నుంచి ట్రెసీ ఎలిస్ రోజ్, లెస్లీ జోర్డాన్ ఈ షోను హోస్ట్ చేయనున్నారు. 

ఆస్కార్ 2022 నామినేషన్స్ జాబితా ఎప్పుడు విడుదలవుతుంది ?
ఇవాళ మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు

ఎక్కడ, ఎలా వీక్షించొచ్చు ?

Oscars.org అనే అధికారిక వెబ్‌సైట్‌తో పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విటర్ పేజీల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆస్కార్ 2022 నామినేషన్స్ షో ప్రతక్ష్య ప్రసారం కానుంది.

Oscar 2022 Nominations date - ఆస్కార్ 2022 నామినేషన్స్ తేదీ ఎప్పుడు ?
ఆస్కార్ 2022 నామినేషన్స్ వివరాలు వెల్లడించేది ఇవాళే అయినప్పటికీ.. మార్చి 27వ తేదీన అసలు విజేతలు ఎవరు అని ప్రకటించి ఆస్కార్ అవార్డ్స్ అందిస్తారు.

Best Film nominations - ఆస్కార్ బెస్ట్ ఫిలిం నామినేషన్స్‌లో చోటు సంపాదించుకునే చిత్రాలపై ఇప్పటికే పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆ చిత్రాలు ఏంటనేది ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం. ఆస్కార్ బెస్ట్ ఫిలిం నామినేషన్స్‌ జాబితాలో చోటు సంపాదించుకునే పది చిత్రాల్లో నెట్‌ఫ్లిక్స్ నుంచే మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ది పవర్ ఆఫ్ ది డాగ్ కాగా రెండోది డోంట్ లుకప్. ఇక మూడో చిత్రం టిక్.. టాక్.. బూమ్. యాపిల్ నుంచి కోడా, ది ట్రాజెడీ ఆఫ్ మాక్‌బెత్ చిత్రాలు ఉన్నాయి. 

Amazon prime - అమేజాన్ ప్రైమ్ నుంచి బీయింగ్ ది రికార్డోస్ చిత్రం ఆస్కార్ రేసులో పోటీపడేందుకు ఆశలు పెట్టుకుంది. థియేటర్లలో, హెచ్‌బీవో మ్యాక్స్‌లో ఏకకాలంలో రిలీజైన డూన్, కింగ్ రిచర్డ్ చిత్రాలతో పాటు థియేటర్లలో మాత్రమే విడుదలైన లికోరైస్ పిజ్జా, బెల్‌ఫాస్ట్ చిత్రాలు నామినేషన్స్‌లో స్థానం దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తర్వాత డీలా పడిన థియేటర్ల బిజినెస్‌కి కొత్త ఊపిరిలూదిన స్పైడర్-మేన్: నో వే హోమ్, నో టైమ్ టు డై చిత్రాలు కూడా ఆస్కార్ నామినేషన్స్ జాబితాలో చోటు దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. 

భారత్ నుంచి ఆస్కార్ 2022 నామినేషన్స్‌కి పోటీపడుతున్న చిత్రాల జాబితాలో జై భీమ్ (Jai Bhim movie), మరక్కార్: లయన్స్ ఆఫ్ ది అరేబియన్ సీ, ఇండియా స్వీట్స్ అండ్ స్పైసెస్ వంటి చిత్రాలు ఉన్నాయి. 

బెస్ట్ యాక్టర్స్ (ఫీమేల్) నామినేషన్స్‌కి పోటీపడుతున్న వారిలో ఒలివియా కోల్మన్, లేడీ గగా, జెన్నిఫర్ హుడ్సన్, నికోల్ కిడ్మన్, క్రజ్, జెస్సికా చెస్టెయిన్, క్రీస్టెన్ స్టీవార్ట్, అలనా హెయిమ్ ఉన్నారు. 

బెస్ట్ యాక్టర్స్ (మేల్) నామినేషన్స్‌కి పోటీపడుతున్న వారిలో బెనెడిక్ట్, ఆండ్రూ గార్ఫీల్డ్, విల్ స్మిత్, డెంజెల్ వాషింగ్టన్, జేవియర్ బార్డం, మహెర్షలా అలీ, లియోనార్డో డికాప్రియో, నికోలస్ కేజ్, బ్రాడ్లీ కూపర్ ఉన్నారు.

Also read : Propose Day 2022: ప్రపోజ్ డే ప్రాముఖ్యత.. ఈ రోజున మీ ప్రేమను అసలు మిస్ కావొద్దు!

Also read : Ratha Saptami 2022: రథసప్తమి వేడుకల సందర్భంగా ఆలయంలో అద్భుతం!

Also read : Flipkart TV Days: స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు.. రూ.16,500లకే 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More