Home> వినోదం
Advertisement

Movies Postponed: 'వ్యూహం, శపథం' మళ్లీ వాయిదా.. నారా లోకేశ్‌కు ఆర్జీవీ అదిరిపోయే పంచ్‌

Vyooham, Shapadham Movies Postponed: ఏపీ రాజకీయాలపై తీసిన 'వ్యూహం, శపథం' సినిమాలు మరోసారి వాయిదా పడ్డాయి. అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయని ఆర్జీవీ ప్రకటించారు. అయితే ఈసారి నారా లోకేశ్‌ మాత్రం కారణం కాదని పంచ్‌ వేశారు.

Movies Postponed: 'వ్యూహం, శపథం' మళ్లీ వాయిదా.. నారా లోకేశ్‌కు ఆర్జీవీ అదిరిపోయే పంచ్‌

RGV Movies: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన 'వ్యూహం, శపథం' సినిమాలు మరోసారి విడుదల వాయిదాకు గురయ్యాయి. ఈనెల 23వ తేదీన 'వ్యూహం', మార్చి 8న 'శపథం' సినిమాలు విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య పరిస్థితులతో వాయిదా పడినట్లు ఆర్జీవీ తెలిపారు. వాయిదాలకు ఈసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మాత్రం కాదని ఆర్జీవీ వ్యంగంగా రాసుకొచ్చారు.

Also Read: Pallavi Prashanth: 'బిగ్‌బాస్‌' పల్లవి ప్రశాంత్‌ కేసులో కీలక మలుపు.. ఈసారి ఏం జరిగిందంటే..?

రామధూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మాణంలో ఈ సినిమాలు వస్తున్నాయి. అజ్మల్‌, మానస కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణానంతరం వైఎస్‌ జగన్‌ ఎదుర్కొన్న పరిస్థితులపై ఈ సినిమాలు తీశారు. మొదటి భాగం వ్యూహంలో 'వైఎస్సార్‌ మరణం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవడం వరకు' చూపించనున్నారు. రెండో భాగం 'శపథం'లో 'జగన్‌ అయ్యాక జరిగిన పరిణామాలు.. 2024 ఎన్నికల వరకు' కథాంశంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.

Also Read: Nitesh Tiwari Ramayan: రామాయణంలో 'జాతిరత్నం'.. కామెడీ హీరో నుంచి లక్ష్మణుడిగా బంపరాఫర్‌ 

ఈ రెండూ సినిమాలు ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కాకపోతే రాజకీయ నేపథ్య సినిమాలు కావడంతో టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నారా లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసి సినిమాను వాయిదా వేయించారు. సెన్సార్‌ బోర్డులో కూడా కొన్ని చిక్కులు ఎదురయ్యాయి. ఇటీవల హైకోర్టు కూడా సినిమా విడుదలకు అభ్యంతరాలు తొలగించడంతో ఈ నెలలో మొదటి భాగం, వచ్చే నెలలో రెండు భాగం విడుదల కావాల్సి ఉంది.

'వ్యూహం సినిమా మార్చి 1వ తేదీకి, శపథం సినిమా మార్చి 8వ తేదీకి వాయిదా పడుతున్నాయి. కానీ ఈ సారి కారణం లోకేష్ కాదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయా తేదీల్లో విడుదల చేస్తే మేము కోరుకుంటున్న థియేటర్లు దొరుకుతాయి' అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 23) సినీ పరిశ్రమలో భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయి. 9 సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో అనుకున్నంత స్థాయిలో థియేటర్లు లభించక సినిమాలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనికితోడు సినిమా ప్రచార కార్యక్రమాలు ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు. వీటన్నిటిని కారణాల నేపథ్యంలో సినిమా వాయిదాకే ఆర్జీవీ మొగ్గు చూపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More