Home> వినోదం
Advertisement

Devara: బాక్సాఫీస్ కి సొర..ఎన్టీఆర్ ‘దేవర’ దెబ్బకు బుక్ మై షో క్రాష్..

Devara: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమా విడుదలకు మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. అక్కడ దేవర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మరోవైపు ఈ సినిమా టికెట్ కోసం అభిమానులు బుక్ మై షో ఓపెన్ చేస్తూనే ఉన్నారు. దీంతో దేవర దెబ్బకు బుక్ మై షో క్రాష్ అయిపోయింది.

Devara: బాక్సాఫీస్ కి సొర..ఎన్టీఆర్ ‘దేవర’ దెబ్బకు బుక్ మై షో క్రాష్..

Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేస్తోన్న సినిమా ‘దేవర’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్ లో కొనసాగుంది.  ప్రీమియర్స్ ద్వారానే అక్కడ మాస్ రచ్చ లేపుతుంది. అంతేకాదు ప్రీ బుకింగ్స్ లో40 వేలకు పైగా టికెట్ సేల్స్ తో భారతీయ సినిమాల్లో ఫాస్టెస్ట్ రికార్డును నమోదు చేసింది దేవర.  అలాగే యూకే, ఆస్ట్రేలియాలో కూడా రికార్డ్ ప్రీ బుకింగ్స్ తో ఈ సినిమా గత్తర లేపుతుంది. ఈ ప్రీ బుకింగ్స్ తో ఇప్పటికే నార్త్ అమెరికాలో 1.5 $ మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తంగా అక్కడ ప్రీ బుకింగ్స్ రూపేణా.. మన దేశ కరెన్సీలో రూ. 14 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు లేకపోలేదు.

మరోవైపు మన దేశంలో కూడా ‘దేవర’ టికెట్ అప్ డేట్ కోసం బుక్ మై షో ను అభిమానులు ఓపెన్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ‘బుక్ మై షో’ క్రాష్ అయింది. దీంతో అభిమానులు ‘దేవర’ టికెట్స్ కోసం ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్దమవుతోంది. ఈ సినిమాకు మాములు టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ లేపడం ఖాయం అని చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈజీగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఈజీగా దాటవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

విడుదలకు 12 రోజుల ముందే ఈ రేంజ్ లో రచ్చ రేపుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు స్పెషల్ పర్మిషన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఈ సినిమాను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు దేవర నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.అటు కొరటాల శివ కూడా ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత తారక్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అని అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అంతకాదు కొరటాలకు దేవర తో తప్పనిసరిగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా తేడా కొడితే.. దర్శకుడిగా కొరటాల శివ కెరీర్ డైలామాలో పడుతుంది. ఈ సినిమాలో బైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. జాన్వీక‌పూర్ ఇందులో తంగం అనే ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో నటించింది. ఆమె లుక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి.

ఈ సినిమా విషయానికొస్తే.. సోలో హీరోగా తారక్ కు ఫస్ట్ ప్యాన్ ప్యాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం  అన్ని ఏరియాల్లో థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయినట్టు సమాచారం. ఇక బాలీవుడ్ లో ‘దేవర’ రూ. 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. అక్కడ ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు.  ఓవరాల్ గా ‘దేవర’  థియేట్రికల్ గా రూ. 150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.  ‘దేవర’ చిత్రం వరల్డ్ వైడ్ గా సెప్టెంబ‌ర్ 27న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో ప్యాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.  

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More