Home> వినోదం
Advertisement

Harihara Veeramallu: పవన్ కల్యాణ్​ 'హరిహర వీరమల్లు'లో బాలీవుడ్ హాట్​ బ్యూటీ?

Harihara Veeramallu Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ నటిస్తున్న తాజా చిత్రం'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నటించనుందనే వార్తలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి.
 

Harihara Veeramallu: పవన్ కల్యాణ్​ 'హరిహర వీరమల్లు'లో బాలీవుడ్ హాట్​ బ్యూటీ?

Harihara Veeramallu Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ (Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu). పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఐదు భాషలలో ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చాలా రోజుల కిందటే నిర్మాణ పనులు మెుదలయిన..కొన్ని కారణాల వల్ల షూటింగ్ కు మధ్యలో బ్రేక్  పడింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. మొగలుల కాలం నాటి కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ వజ్రాల దొంగగా కనిపించినున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటులు  నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కీలకపాత్రల్లో నటించనున్నారు. తాజాగా మరో బాలీవుడ్ యాక్టర్ ఈ సినిమాలో భాగం కానున్నారు. ఆమె బీటౌన్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi). ఇందులో ఈ భామ నెగెటివ్ షేడ్స్ ఉండే గ్లామరస్ రోల్‌లో నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలో చిత్రబృందం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. టాలీవుడ్ లో బాహుబలి, టెంపర్, ఊపిరి, లోఫర్ చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. రీసెంట్ గా పవన్​ సెట్స్​లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను చిత్రయూనిట్ పోస్ట్ చేసింది. ఈ ఫిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Also Read: Ram Charan Upasana: చిరంజీవి అంటే భయమా లేదా ఉపాసననా.. తెలివైన సమాధానం ఇచ్చిన రామ్ చరణ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More