Home> వినోదం
Advertisement

Nora Fatehi Defamation case : పరువు నష్టం దావా.. జాక్వెలిన్‌ మీద కసి తీర్చుకున్న నోరా ఫతేహి

Nora Fatehi Defamation case బాలీవుడ్ భామలు మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సుఖేష్ చంద్రశేఖర్ రెండు వందల కోట్ల స్కాంలో భాగంగా నోరా ఫతేహి, జాక్వెలిన్‌లను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.

Nora Fatehi Defamation case : పరువు నష్టం దావా.. జాక్వెలిన్‌ మీద కసి తీర్చుకున్న నోరా ఫతేహి

Nora Fatehi Defamation case దేశ వ్యాప్తంగా సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసు ఎంతటి సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. సెలెబ్రిటీలను మోసం చేస్తూ బెదిరిస్తూ దాదాపు రెండు వందల కోట్లు లాగేసిన సుఖేష్ చంద్రశేఖర్ కేసులో బాలీవుడ్‌ భామలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహిల పేర్లు వచ్చిన సంగతి తెలిసిందే. జాక్వెలిన్, సుఖేష్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. ఇక జాక్వెలిన్ కోసం సుఖేష్ బాగానే ఖర్చు పెట్టాడని తెలుస్తోంది.

నోరా ఫతేహి సైతం సుఖేష్ చేతుల మీద కోట్ల విలువైన బహుమతులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మనీ లాండరింగ్ కేసులో తన పేరును కావాలనే లాగుతోందని జాక్వెలిన్ మీద నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో తన పేరుని కావాలనే లాగుతోందని, తన పరువుతీస్తోందంటూ నోరా వాపోయింది.

తనకు, సుఖేష్‌కు ఎప్పుడూ డైరెక్ట్ కాంటాక్ట్ కూడా లేదని నోరా వెల్లడించింది. తాను ఓ సారి సుఖేష్‌ భార్య లీనా ఆహ్వానం మేరకు వెళ్లానని చెప్పుకొచ్చింది. ఆమె తనకు బహుమతులు ఇచ్చిందని నోరా తెలిపింది. అయితే ఈ విషయం మీదే నోరాను ఈడీ అధికారులు విచారించారని తెలుస్తోంది. కొత్త ఐఫోన్, ఖరీదైన బ్యాగులు, బీఎండబ్ల్యూ కారును బహుమతులుగా ఇచ్చారట. దీనిపై నోరాను ఈడీ ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్న సంగతి విదితమే.

Also Read : Unstoppable With NBK : ప్రభాస్‌ను అలా పిలిచిన బాలయ్య.. ఎపిసోడ్ అంతా అంతేనట

Also Read : Upasana Konidela Pregnancy : తండ్రి కాబోతోన్న రామ్ చరణ్‌.. గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More