Home> వినోదం
Advertisement

Nithya Menon: బార్ పెడతానంటున్న నిత్యామీనన్... ఆసక్తికరంగా ‘కుమారి శ్రీమతి’ సిరీస్ ట్రైలర్

Nithya Menon Web Series: ప్రస్తుతం నిత్యామీనన్ ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల చివరలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. 
 

Nithya Menon: బార్ పెడతానంటున్న నిత్యామీనన్... ఆసక్తికరంగా ‘కుమారి శ్రీమతి’ సిరీస్ ట్రైలర్

Kumari Srimathi web series Trailer: స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ లీడ్ రోల్ లో నటిస్తున్న వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‍లో సీనియర్ నటి గౌతమి, నిరుపమ్, తిరువీర్, తాళ్లూరి రామేశ్వర రావు, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్ తదితరులు కీ రోల్స్ చేశారు. లేడి ఓరియెంట్‌ కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు గోమతేశ్ ఉపాధ్యే డైరెక్షన్ చేశారు. బార్ పెట్టి తన ఇంటిని దక్కించుకునే పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది. ఈ ట్రైల‌ర్‌ను టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని విడుదల చేశారు. 

అవసరాల శ్రీనివాస్ ఈ వెబ్ సిరీస్‌కు కథను అందించాడు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‍కు చెందిన ఎర్లీ మాన్‍సూన్ టేల్స్, స్వప్నా సినిమాస్ పతాకాలు ఈ సిరీస్‍ను నిర్మించాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సిరీస్ పై భారీగా అంచనాలను పెంచేశాయి. 

 ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నిత్యామీనన్. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రాలతో అనతి కాలంలోనే అగ్రకథానాయికగా ఎదిగింది నిత్యా. ఆ మధ్య కాస్త డల్‌ అయినట్లు కనిపించినా.. ‘భీమ్లానాయక్‌’, ‘తిరు’ సినిమాలతో మళ్లీ హిట్ ట్రాక్ లో పడింది. 

Also Read: BB 7 Telugu latest promo: కింద పడ్డా శోభా.. గుండె పగిలేలా ఏడ్చిన యావర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More