Home> వినోదం
Advertisement

Spy Movie in OTT: ఓటీటీలోకి సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చిన 'స్పై' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ నటించిన 'స్పై' మూవీ ఓటీటీ ఎంటీ ఇచ్చేసింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా స్పై మూవీ గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే..
 

Spy Movie in OTT: ఓటీటీలోకి సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చిన 'స్పై' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Spy Movie in OTT: నిఖిల్ లేటెస్ట్ మూవీ 'స్పై'(Spy Movie). జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిఖిల్ (Nikhil Siddhartha) కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టినప్పుటికీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య మేనన్ (Iswarya Menon) హీరోయన్ గా నటించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. 'కార్తికేయ 2' మూవీతో తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో జనాలు తొలి రోజు ఎగబడి థియేటర్లకు క్యూ కట్టారు. సినిమాలో సరుకు లేకపోవడంతో ఆ తర్వాత రోజు నుంచి థియేటర్లన్నీ వెలవెలబోయాయి. 

అయితే ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా 'స్పై' మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే అంచనాలను పెంచేసింది.  అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. ఈ మూవీ రిజల్ట్ విషయంలో నిఖిల్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ చిత్రంలో ఆర్య‌న్ రాజేష్, స‌న్యా ఠాకూర్, జిషుసేన్‌గుప్తా, అభిన‌వ్ గోమటం, మ‌కరంద్‌దేశ్‌పాండే కీలకపాత్రల్లో నటించారు. రానా ఒక్క సీన్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. 

Also read: Hi Nanna: టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మరో బాలీవుడ్ హీరో.. నాని సినిమాలో విలన్‌గా ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More