Home> వినోదం
Advertisement

Anupama Parameswaran: న్యూఇయర్ రోజు టిల్లుతో కలిసి రెచ్చిపోయిన అనుపమ.. మరి ఇంత బోల్డ్ గానా..

Anupama Parameswaran: న్యూఇయ‌ర్ విషెస్ బోల్డ్‌గా చెప్పి అభిమానుల‌ను షాకిచ్చింది టిల్లూ స్క్వేర్ టీమ్‌. ఇందులో అనుపమ పరమేశ్వరన్ రెచ్చిపోయింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. 
 

Anupama Parameswaran: న్యూఇయర్ రోజు టిల్లుతో కలిసి రెచ్చిపోయిన అనుపమ.. మరి ఇంత బోల్డ్ గానా..

Tillu Square- Anupama Parameswaran: 2022లో వ‌చ్చిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న మూవీ టిల్లు స్క్వేర్. సిద్ధూ జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా ఓ కిరాక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీటీమ్. ఇందులో అనుపమ చాలా బోల్డ్ లుక్‌లో క‌నిపించి షాకిచ్చింది. త‌న బ్యాక్ చూపిస్తూ సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ ఒడిలో కూర్చొని సెక్సీ లుక్స్ తో రెచ్చిపోయింది. ఈ ఫోటోను అనుప‌మ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లోనూ షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

అనుపమ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎప్పుడు తన హద్దుమీరలేదు. చాలా వరకు సంప్రదాయబద్ధంగానే కనిపించింది. అయితే టిల్లూ స్క్వేర్ మూవీ కోసం మాత్రం ఈ బ్యూటీ చెల‌రేగిపోతోంది. తాజాగా బోల్డ్ లుక్ తో కనిపించడంతో అనుపమ ఫ్యాన్స్ కొందరు హార్ట్ అవుతున్నారు. మరోవైపు టిల్లూ స్క్వేర్ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. టికెటే కొనకుండా, రాధిక సాంగ్స్ అయితే సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఈ చిత్రానికి మ‌ల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. రిలీజ్‌కు నెల రోజులే సమయం ఉండ‌టంతో మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్రయూనిట్. టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి కూడా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Also Read: Chiranjeevi Venkatesh Multistarrer: అదిరిపోయే కాంబో.. మెగాస్టార్ తో వెంకటేష్ మల్టీస్టారర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More