Home> వినోదం
Advertisement

OTT & Theatre Release Movies: ఈ వారం ధియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలివే

OTT & Theatre Release Movies: వేసవి ఎంటర్‌టైన్‌మెంట్ మస్త్‌గా ఇచ్చేందుకు ధియేటర్లతో పాటు ఓటీటీలు సిద్ధమయ్యాయి. ఈ వారమంతా ధియేటర్, ఓటీటీల్లో భారీగా సరికొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాల జాబితా ఏంటో చూద్దాం..
 

OTT & Theatre Release Movies: ఈ వారం ధియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలివే

OTT & Theatre Release Movies: వేసవి ఎంటర్‌టైన్‌మెంట్ మస్త్‌గా ఇచ్చేందుకు ధియేటర్లతో పాటు ఓటీటీలు సిద్ధమయ్యాయి. ఈ వారమంతా ధియేటర్, ఓటీటీల్లో భారీగా సరికొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాల జాబితా ఏంటో చూద్దాం..

ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలకు ప్రాధాన్యత, ఆదరణ ఎక్కువైంది. అందుకే బడ్జెట్‌తో సంబంధం లేకుండా అన్ని సినిమాలు ధియేటర్లతో పాటు ఓటీటీ వేదికల్ని ఆశ్రయిస్తున్నాయి. ఇప్పుడు  వేసవి కావడంతో భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. కొన్ని సూపర్ హిటి సినిమాలు ఇప్పటికే విడుదల కాగా..మరికొన్ని ఈ వారంలో అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో విడుదల కానున్నాయి.

ధియేటర్లలో...

రాజశేఖర్ ప్రధానపాత్రలో జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన శేఖర్ చిత్రం మే 20 న ధియేటర్లలో విడుదల కానుంది. రాజశేఖర్ సరికొత్త పాత్రలో కొత్తగా కన్పించనున్నాడు. ఇక సోనాక్షి, సంపూర్ణేష్ బాబు జంటగా ధగడ్ సాంబ్ సినిమా కూడా మే 20 విడుదలవుతోంది. కుటుంబసమేతంగా చూడదగ్గ కామెడీ ఎంటర్‌టైనర్. 

ఇక బాలీవుడ్ విషయానికొస్తే కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థాకడ్ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా మే 20 విడుదలవుతోంది. ఏజెంట్ అగ్ని పాత్రలో కంగనా విభిన్నంగా కన్పించబోతోంది. ఈ చిత్రాన్ని రజనీష్ ఘయ్ తెరకెక్కించాడు. మరో హారర్ కామెడీ చిత్రం భూల్ భులయ్యా 2. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా మే 20న విడుదలవుతోంది. 

ఇక ఓటీటీ వేదికగా..

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన రాజమౌళి తెరకెక్కించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ మే 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. T-VOD పద్ధతిలో అద్దె చెల్లించి సినిమా చూడాల్సి వస్తుంది. ఇక చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన కొరటాల శివ దర్శకత్వంలోని ఆచార్య అమెజాన్ ప్రైమ్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక యువ నటుడు శ్రీవిష్ణు నటించిన భళా తందనాన చిత్రం మే 20న డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక మోహన్ లాల్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ 12th Man సినిమాను జీతూ జోసెఫ్ తెరకెక్కించాడు. ఈ సినిమా అయితే నేరుగా మే 20న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.

ఇవి కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో ది ఇన్విజిబుల్ మ్యాన్, ది హంట్, హూ కిల్డ్ సారాలు మే 16, 18 తేదీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. జీ5లో జోంబ్లివి సినిమా విడుదలవుతోంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పంచాయత్ వెబ్‌సిరీస్ సీజన్ 2 మే 20 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Also read: Ormax Media Survey: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో హీరోయిన్లు ఎవరో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More