Home> వినోదం
Advertisement

Chaitanya Master Suicide : మల్లెమాల, ఢీ షోపై ట్రోల్స్.. చైతన్య మాస్టర్‌ను మరిచిపోయారా?

Mallemala And Dhee మల్లెమాల, ఢీ మీద ఇప్పుడు జనాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మల్లెమాల నిర్వాహణ, ఢీ టీం మీద మండి పడుతున్నారు. చైతన్య మాస్టర్ గురించి ఒక్క ఎపిసోడ్‌లోనూ మాట్లాడటం లేదని ఫైర్ అవుతున్నారు. అయితే ఇవన్నీ ముందుగానే చేసిన షోలు అని అర్థం అవుతోంది.

Chaitanya Master Suicide : మల్లెమాల, ఢీ షోపై ట్రోల్స్.. చైతన్య మాస్టర్‌ను మరిచిపోయారా?

Chaitanya Master Suicide ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్‌ సూసైడ్ చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధతోనే తాను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా సెల్ఫీ వీడియెను చివరగా రికార్డ్ చేసుకున్నాడు చైతన్య మాస్టర్. ఆ తరువాత హోటల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు. అయితే చైతన్య మాస్టర్‌ కోసం మల్లెమాల గానీ, ఢీ సంస్థ గానీ ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్, హైపర్ ఆది వంటి వారు నాడు సంతాపాన్ని తెలియజేస్తూ పోస్టుల వేశారు.

చైతన్య మాస్టర్ మరణించి రెండు మూడు వారాలు అవుతున్నా.. ఢీ షోలో ఇంత వరకు ఆయన ప్రస్థావన మాత్రం తీసుకురావడం లేదు. అయితే ఇప్పుడు ప్రసారం చేస్తున్న ఎపిసోడ్‌లు అన్నీ కూడా చైతన్య మాస్టర్ బతికి ఉన్న సమయంలోనే షూట్ చేసినవని తెలుస్తోంది. అందుకే చైతన్య మాస్టర్‌కు నివాళిగా ఒక్క ఎపిసోడ్‌ను కూడా ఇంకా ప్రసారం చేయడం లేదనిపిస్తోంది.

తాజాగా రిలీజ్ చేసిన ఫినాలే ఎపిసోడ్ ప్రోమో మీద జనాలు మండిపడుతున్నారు. ఇందులోనూ చైతన్య మాస్టర్ గురించి ప్రస్థావించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైతన్య మాస్టర్ కీ నివాళులు సమర్పించండి సర్ దయచేసి .. చనిపోయినప్పుడు మేము గుర్తుకు రాలేదా ? అని చాలా మాటలు చెప్పారు అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Also Read:  NTR Centenery Celebrations : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు యంగ్ టైగర్ దూరం.. రాత్రికి రాత్రే ఏం జరిగింది?

తోటి డాన్స్ మాస్టర్ చనిపోతే కనీసం ఒక నిమిషం కూడ మౌనం పాటించలేని చెత్త షో....  శేఖర్ మాస్టారు... ఛీ... అసహ్యం వేస్తుంది ఈ  అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. అన్న డి ప్రోమో మొత్తం చూస్తున్నాను కానీ చైతన్య మాస్టర్ మనకు దూరమై చాలా రోజులు అవుతుంది ఫుల్ వీడియో లో కానీ ఎక్కడ ఆయన గురించి ఎవరూ మాట్లాడక పోవడం చాలా బాధాకరం అని మరో నెటిజన్ ఎమోషన్ అయ్యాడు.

Also Read:  Bandla Ganesh Devara : నా టైటిల్ కొట్టేశారు.. ఎన్టీఆర్ దేవరపై బండ్ల గణేష్ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More