Home> వినోదం
Advertisement

NBK - Bhagavanth Kesari: వంద రోజులు పూర్తి చేసుకున్న బాలకృష్ణ 'భగవంత్ కేసరి'..

NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు  కనెక్ట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. ఈ మూవీ నేటితో 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది.

NBK - Bhagavanth Kesari: వంద రోజులు పూర్తి చేసుకున్న బాలకృష్ణ 'భగవంత్ కేసరి'..

NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు  కనెక్ట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. ఈ మూవీ నేటితో 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది.

NBK - Bhagavanth Kesari 100 Days: నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఎన్నడు లేనంతగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాదు వరుస సక్సెస్‌లతో దూకుడు మీదున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ'తో పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన బాలయ్య.. ఆ తర్వాత 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో చాలా యేళ్ల తర్వాత హాట్రిక్ హిట్స్ నమోదు చేసారు. ఈ మూవీలో బాలయ్య ఎలాంటి డ్యూయట్ లేకుండా తన ఏజ్‌కు తగ్గ పాత్రలో రాణించాడు. అంతేకాదు యాక్షన సీక్వెన్స్‌లలో తనదైన ముద్ర వేసారు. అనిల్ రావిపూడి మొత్తంగా బాలయ్యకు తగ్గ స్టోరీని రెడీ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల మెచ్చేలా తెరకెక్కించాడు.

'భగవంత్ కేసరి' మూవీతో బాలయ్య రికార్డులను బద్దులు కొట్టాడు. సీనియర్ హీరోల్లో వరుసగా ఎవరు మూడు రూ. 100 కోట్ల గ్రాస్.. రూ. 70 కోట్ల షేర్ అందుకున్న హీరో ఎవరు లేరు. తన తరం హీరోల్లో ఈ రికార్డు అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా నిలిచారు. ముఖ్యంగా బాలయ్య గెటప్, మాస్ అప్పీరియన్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 72 కోట్ల షేర్.. రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా ఇరగదీస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు బాలయ్య చెప్పిన డైలాగులపై నార్త్ ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ మూవీ నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ 100 రోజుల పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ డిజిటల్ యుగంలో బాలయ్య నటించిన సినిమాలు వరుసగా హిట్ అవ్వడమే కాదు.. థియేట్రికల్‌గా 100 రోజులు పూర్తి చేసుకోవడం కూడా ఓ విశేషమనే చెబుతున్నారు. బాలయ్య.. ప్రస్తుతం బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టేనర్‌ చేస్తున్నారు. ఈ మూవీలో మరోసారి బాలయ్య డాన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. 

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

Also Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More