Home> వినోదం
Advertisement

Ramya Krishnan: నాన్న, అన్న, భర్త.. రమ్యకృష్ణకి మూడు వరసల్లో నటించిన యాక్టర్ ఎవరో తెలుసా?

Ramya Krishnan Movies: ఎప్పటినుంచో ఇండస్ట్రీలో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ.. ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న నటి రమ్యకృష్ణ. కెరీర్లు ఎన్నో వందల సినిమాలు చేసిన రమ్యకృష్ణ చాలామందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఒక నటుడు మాత్రం ఒకసారి భర్తగా, ఒకసారి అన్నగా.. మరొకసారి నాన్నగా కూడా కనిపించారు. ఆ నటుడు ఎవరో తెలుసా? 

Ramya Krishnan: నాన్న, అన్న, భర్త.. రమ్యకృష్ణకి మూడు వరసల్లో నటించిన యాక్టర్ ఎవరో తెలుసా?

Ramya Krishnan Movies: సీనియర్ నటి రమ్యకృష్ణ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో.. నటించిన రమ్యకృష్ణ అటు స్టార్ హీరోల నుంచి ఇటు సీనియర్ హీరోల దాకా దాదాపు అందరూ హీరోలతో ఏదో ఒక విధంగా కలిసి నటించారు. హీరోల సంగతి పక్కన పెడితే ఒక నటుడు మాత్రం రమ్యకృష్ణ కి మూడు వరసలలో కనిపించారు. 

అంటే ఒక సినిమాలో రమ్యకృష్ణ అన్నయ్య పాత్ర పోషించిన నటుడు మరొక సినిమాలో రమ్యకృష్ణ తండ్రిగా కనిపించారు. ఆ తర్వాత మరొక సినిమాలో అదే నటుడు రమ్యకృష్ణ భర్తగా కూడా కనిపించారు. ఇంతకీ ఆ నటుడు మన అందరికీ తెలిసిన ప్రముఖ యాక్టర్. ఆయన మరెవరో కాదు నాజర్. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాక తమిళ్ ఇండస్ట్రీలో కూడా నాజర్ చాలా పేరు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. 

నాజర్ రమ్యకృష్ణ కలిసి చాలానే సినిమాలలో నటించారు. అయితే ఒకసారి రజనీకాంత్ నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నాజర్ చెల్లెలి పాత్రలో కనిపించారు. ఆ తరువాత అత్తారింటికి దారేది తమిళ వెర్షన్ అయిన వంత రాజవతన్ వరువేన్ సినిమాలో రమ్యకృష్ణ నాజర్ కూతురుగా రమ్యకృష్ణ నటించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో రాజమాత రమ్యకృష్ణ భర్త బిజ్జల దేవుడిగా నాజర్ కనిపించి మెప్పించారు. 

ఇలా నాజర్ తో మూడు విభిన్న పాత్రల్లో నటించారు రమ్యకృష్ణ. అప్పటిదాకా హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి.. బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్న రమ్య కృష్ణ బాహుబలి సినిమా తర్వాత.. మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పవర్ ఫుల్ పాత్రలను ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 

ఇక ఈ మధ్యనే రమ్యకృష్ణ.. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రలో కనిపించారు. ఈ మధ్యనే రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన పురుషోత్తముడు సినిమాలో కూడా రమ్యకృష్ణ కనిపించారు. తెలుగులో మాత్రమే కాక తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా రమ్యకృష్ణ చాలా పాపులర్.

Also Read: Infinix Zero 40: కేక పెట్టించే ఫీచర్లు, 108MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమేరాతో Infinix

Also Read: Malaika father Suicide: స్టార్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్‌ నుంచి దూకి సూసైడ్‌..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More