Home> వినోదం
Advertisement

Nayanthara Love Stories: తమిళ రాజకీయాల్లో నయనతార ప్రేమ కథల ప్రభావం

Nayanthara Secret Love Stories | ఉదయనిధి స్టాలిన్, నయనతార పై పోలీస్ స్టేషన్ లో కేసు వేయనున్నట్టు మంత్రి రాజేంద్ర బాలాజీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇటీవలే సంచలనం కలిగించింది

Nayanthara Love Stories: తమిళ రాజకీయాల్లో నయనతార ప్రేమ కథల ప్రభావం

Nayanthara Love Stories | ఉదయనిధి స్టాలిన్, నయనతార పై పోలీస్ స్టేషన్ లో కేసు వేయనున్నట్టు మంత్రి రాజేంద్ర బాలాజీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇటీవలే సంచలనం కలిగించింది. తమిళ పరిశ్రమలో హట్ కపుల్స్ గా పాపులర్ అయిన నయనతార, దర్శకుడు విగ్నేషన్ శివన్ ఈ మధ్య కాలంలో ఎన్నో బ్యూటిఫుల్ ఫోటోలను తమ ఫ్యాన్స్ కోసంషేర్ చేస్తున్నారు. ఇలా నయనతార నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

ALSO READ| Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?

గత కొన్ని సంవత్సరాలుగా కపుల్స్ గా ఉన్న వీరిద్దరు కొన్ని విదేశీ ప్రయాణాలు కూడా చేస్తున్నారు. వారి మధ్య కొన్ని క్లోజ్జ్ మూమెంట్స్ కూడా ఫోటోల్లో బంధీ అయ్యాయి. 2015లో విఘ్నేష్ శివన్  తెరకెక్కించిన ఒక చిత్రం విడుదలైంది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే నయనతార (Nayanthara ) , విఘ్నేష్ మధ్య ప్రేమ చిగురించినట్టు సమాచారం. త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నట్టు సమాచారం.

నయనతార శింభు (Simbu ) ప్రేమ కథ కూడా అందరికీ తెలిసిందే. కెరియర్ ఆరంభంలో నయతార, శింబు మధ్య లవ్ స్టోరీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ప్రభుదేవా ( Prabhudeva ), శివన్ కన్నా ఎక్కువ సమయం శింబుతో నయన ప్రేమ కథ నడిచింది. 

Also Read |  Kamal Haasan: నటనతో పాటు కమల్ హాసన్ ఈ 5 విషయాల్లో దిట్ట అని తెలుసా ?

అయితే మధ్యలో ప్రముఖ నటుడు, పొలిటికల్ ఫ్యామిలీ కి చెందిన ఉదయనిధి స్టాలిన్ తో కూడా సీక్రెట్ ఎపైర్ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనుండగా ఈ విషయాన్ని ప్రత్యర్థులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే తమిళనాట సినిమా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది.

ALSO READ | Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు.. 

ఎన్నికల వ్యూహాంలో భాగంగానే ఉదయనిధి స్టాలిన్, నయనతార పై పోలీస్ స్టేషన్ లో కేసు వేయనున్నట్టు మంత్రి రాజేంద్ర బాలాజీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇటీవలే సంచలనం కలిగించింది. వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ఏదో ఉన్నట్టు వార్తలు పుట్టుకు వచ్చాయి.

వాటిని ఆధారంగా తీసుకుని ఇలా రాజకీయం చేయడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం.నిజానికి సెలబ్రిటీల జీవితం ఎంత రంగులమయం ఉంటుందో.. అంతే ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి నయనతార జీవితమే ఉదాహరణ. 

Also Read | 19 Years of Amrutham : 19 సంవత్సరాలుగా తెలుగు వారి గుండెల్లో అమృతం వర్షం

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Read More