Home> వినోదం
Advertisement

Nayanthara Video : నడిరోడ్డు మీద నయన్ విఘ్నేశ్.. మంచి మనసు చాటుకున్న జంట

Nayanthara Gifts to Roadside People నయనతార మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ గురించి ఎక్కువగా బయటకు రాదు గానీ మంచి పనులు చేసేందుకు, ఎదుటి వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తుంటుంది.

Nayanthara Video : నడిరోడ్డు మీద నయన్ విఘ్నేశ్.. మంచి మనసు చాటుకున్న జంట

Nayanthara And Vignesh Shivan Video నయనతార విఘ్నేశ్ శివన్ జోడి ముందు నుంచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అన్నింట్లోనూ తమ మార్క్ చూపిస్తున్నారు. పెళ్లి నాడు రాష్ట్రంలోని అనాథలు, వృద్దులకు అన్నదానం చేశారు. రాష్ట్రంలో వేల అనాథాశ్రమాల్లో అన్నదానం చేసి మంచి మనసు చాటుకున్నారు. ఇలా తమ పెళ్లి నాడు అందరి కడుపు నింపాలనే ఆలోచనే ఎంతో గొప్పగా ఉంది. అలా ఈ జంట ఎప్పుడూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది.

అయితే తాజాగా ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో నయన్ విఘ్నేశ్ జోడి.. రోడ్డు పక్కన ఉన్న వృద్దులకు, పిల్లలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఫ్యాక్‌లను పంచేశారు. ఇందులో నయన్, విఘ్నేశ్ ఇద్దరూ ఎంతో సింపుల్‌గా వచ్చి.. అందరికీ ఇలా బహుమతులు పంచుతూ వచ్చారు. నయన్ సింప్లిసిటీని చూసి వారంతా కూడా ఆశ్చర్యపోతోన్నారు.

 

ప్రస్తుతం ఈ జోడి మంచి మనసును చూసి అంతా మురిసిపోతోన్నారు. నిజంగానే తంగమై, బంగారం అంటూ నయన్‌ని పొగిడేస్తున్నారు. నయన్ తన పెళ్లి అనంతరం ఎన్ని వివాదాల్లో చిక్కుకుందో అందరికీ తెలిసిందే. తిరుమల మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిందని, ఫోటో షూట్ చేసిందంటూ ఆ మధ్య వివాదం జరిగింది.

ఆ తరువాత కవల పిల్లలను సరోగసి ద్వారా కనడం కూడా దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఇండియాలో సరోగసి నిషేధించడంతోనే ఈ వివాదం ఎక్కువైంది. అయితే నయన్ పెళ్లి ఐదారేళ్ల క్రితమే జరిగిందని, నిబంధనలకు అనుగుణంగానే సరోగసి జరిగిందని మద్రాస్ కోర్టు తీర్పునిచ్చింది. అలా ఈ వివాదం అయితే సద్దుమణిగింది. ఇక నయన్ కనెక్ట్ అనే సినిమాతో రీసెంట్‌గా తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించింది.

కనెక్ట్ సినిమా తెలుగులో అంతగా కనెక్ట్ కాలేదు గానీ ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నయనతార చెప్పిన విషయాలు మాత్రం బాగానే హైలెట్ అయ్యాయి. ఇక విఘ్నేశ్ శివన్ చేయబోయే అజిత్ సినిమా మీద ఇప్పుడే అంచనాలు ఆకాశన్నంటేశాయి.

Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట

Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More