Home> వినోదం
Advertisement

Ante Sundaraniki : నానీ, అంటే సుందరానికి...

Natural Star Nani: నేచురల్ స్టార్ నానీ కొత్త చిత్రాన్ని ఇవాళ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి " అంటే.. సుందరానికి "  అనే టైటిల్ పెట్టారు

Ante Sundaraniki : నానీ, అంటే సుందరానికి...

Natural Star Nani: నేచురల్ స్టార్ నానీ కొత్త చిత్రాన్ని ఇవాళ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అంటే.. సుందరానికి  అనే టైటిల్ పెట్టారు. మోస్ట్ ట్యాలెంటెడ్ వివేక్ ఆత్రేయతో ఈ చిత్రం చేయనున్నాడు నాని.

Also Read | Google Photos: వచ్చే సంవత్సరం నుంచి గూగుల్ ఫోటోస్ ఫ్రీ వర్షన్ మార్పులు

నానీ ( Nani) చిత్రాలను ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టంగా చూస్తుంటారు. యూత్ సెంట్రిక్, ఇమోషనల్ మూవీస్ అవడంతో బాగా కనెక్ట్ అవుతుంటారు. పైగా నానీ కామెడీ టైమింగ్ సెన్స్ అంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులను ఇష్టపడుతుంటారు. అదే కోవలో అంటే సుందరానికి సినిమా ఉండనుంది అని తెలుస్తోంది.

రాజారాణి, బెంగళూరు డేస్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సాధించిన నజ్రియా నాజిమ్ ( Nazria Nazim ) ఈ మూవీలో కథానాయికగా నటించనుంది. ఈ చిత్రం ఎంత హ్యాప్పెన్నింగ్ గా, హాయిగా, సరదాగా ఉండనుందో పోస్టర్ ను చూసి అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి.

Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు

ప్రయాణం ఉంది, తెలుగుతనం ఉంది, విచిత్రం ఉంది.. మొత్తానికి ఈ చిత్రం వినోదం ప్రధానంగా సాగనుంది అని తెలుస్తోంది. 2021లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Read More