Home> వినోదం
Advertisement

Dasara gifts: సినిమా రిలీజ్ కూడా అవ్వకుండానే నాని సినిమా టీంకు ఐఫోన్స్ గిఫ్ట్.. ఈలెక్కన మరో పుష్పనే?

Dasara Producer Iphones gifts: సినిమా రిలీజ్ కూడా అవకుండానే అవుట్ ఫుట్ నచ్చి దసరా సినిమా నిర్మాత తన కీ టీమ్ కు ఐఫోన్స్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు 
 

Dasara gifts: సినిమా రిలీజ్ కూడా అవ్వకుండానే నాని సినిమా టీంకు ఐఫోన్స్ గిఫ్ట్.. ఈలెక్కన మరో పుష్పనే?

Nani’s Dasara Producer gives Iphones as gifts: సాధారణంగా సినిమా హిట్ అయిన తర్వాత ఆ సినిమాకు పని చేసిన నటీనటులు లేకపోతే టెక్నీషియన్లకు బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా సినిమా విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన తర్వాతే ఈ ప్రక్రియ చేపడుతూ ఉంటారు దర్శకనిర్మాతలు. అదే విధంగా నిర్మాతలు దర్శకులకు కూడా కార్లు, ఇళ్ళు గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి మాత్రం ఒక అడుగు ముందుకేసి సినిమా ఇంకా పూర్తికాకుండానే సినిమా యూనిట్కు బహుమతులు వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. చాలామంది సినీ పరిశ్రమ అంటే కమర్షియల్ అని అన్నీ డబ్బుతోనే కూడుకుని ఉంటుందని భవిస్తూ ఉంటారు. ఎలాంటి హ్యూమన్ ఎమోషన్స్ కి తావు లేదు అని అనుకుంటూ ఉంటారు. అందుకో కొంతవరకు నిజమే కానీ సుధాకర్ లాంటి నిర్మాతలు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి తనకోసం తన సినిమా కోసం పనిచేస్తున్న వారిని మరింత ఆనందింపచేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

సినిమాకి తమ ప్రాణం పెట్టి పనిచేసే టెక్నీషియన్లకు ఇలాంటి బహుమతులు లభించినప్పుడు వారి ఆనందం రెట్టింపవడమే గాక సినిమాకు మరింత కష్టపడి పనిచేయాలనే ఉత్సాహం ఇస్తుంది. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రామ్ చరణ్ తన టీం కి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ ఇవ్వటం ఎన్టీఆర్ తండ్రి టీంకి వాచీలు గిఫ్ట్ ఇవ్వటం ఇలా సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు నాని సినిమా నిర్మాత కూడా అదే పని చేసినట్టు తెలుస్తోంది.

దసరా సినిమా అవుట్ పుట్ చూసిన తర్వాత కీ టీంగా చెబుతున్న కొంత మందికి ఆయన ఐఫోన్లు గిఫ్ట్ ఇచ్చారట. సుధాకర్ చెరుకూరి చేసిన ఈ పని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా మారుతున్నాడు. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప తరహాలోనే ఈ సినిమా రా అండ్ రస్టిక్ గా ఉంటుందని కచ్చితంగా ప్రేక్షకులందరికీ మెప్పించే విధంగా సాగుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

Also Read: Love Today Telugu Movie Review : లవ్ టుడే రివ్యూ.. ఫన్ అండ్ ఎమోషనల్

Also Read: Thodelu Movie Review: వరుణ్ థావన్ 'తోడేలు' కాటు వేసిందా?.. సినిమా ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 
Read More