Home> వినోదం
Advertisement

Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌.. బాలయ్య కుమారుడి రాక కోసం నందమూరి ఫ్యాన్స్ వెయిటింగ్..

Mokshagna Nandamuri: గత పదేళ్ల కాలంలో  బాలకృష్ణ ఫ్యాన్స్ తమ హీరో కుమారుడిని సినీ రంగంలో ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బాలయ్య  తనయుడు  అరంగేట్రనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.

 Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌.. బాలయ్య కుమారుడి రాక కోసం నందమూరి ఫ్యాన్స్ వెయిటింగ్..

Mokshagna Nandamuri: నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసే రోజు రాని వచ్చింది. దాదాపు నందమూరి కుటుంబం నుంచి వారసుడు వచ్చి 19 ఏళ్లు అవుతుంది. మరి ముఖ్యంగా బాలయ్య బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి  ఎదురు చూస్తున్నారు. అప్పట్లో  మోక్షజ్ఞ ఆదిత్య 369 మూవీ సీక్వెల్ ఆదిత్య 999 మాక్స్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అప్పట్లో అనౌన్స్ చేశారు బాలయ్య. నందమూరి కళ్యాణ్ రామ్ తర్వాత ఆ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో హీరోగా మోక్షు ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య మోక్షజ్ఞ లావు కనిపించి అభిమానులకు షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు మధ్యలో అతను హీరోగా చేయడంపై ఇంట్రెస్ట్ లేదని వాదనలు వినిపించాయి. కానీ బాలయ్య మాత్రం మోక్షజ్ఞను డాన్స్, ఫైట్స్, డైలాగ్స్, నటనలో శిక్షణ ఇప్పించాడు కూడా. తాజాగా మోక్షజ్ఞ స్లిమ్ అయి కొత్త లుక్ కనిపించి అభిమానులను ఖుషీ చేసాడు.

ఇప్పటికే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖాయమైంది.  వచ్చే నెల ఒకటో తేదీన ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించనున్నారు.  ఆ రోజున బాలయ్య.. హీరోగా ఎంట్రీ ఇచ్చి 50 యేళ్లు పూర్తవుతుంది.ఈ సందర్బంగా సినీ ఇండస్ట్రీ బాలయ్యను ఘనంగా సన్మానించబోతున్నారు. ఈ శుభ తరుణంలోనే మోక్షజ్క్ష ఫస్ట్ మూవీ అఫీషియల్ గా ప్రకటించాడానికి మంచి ముహూర్తం లేదనే వాదన వినిపిస్తోంది.

అంతేకాదు సెప్టెంబర్ 1న అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజున ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

ఈ సినిమాను ప్రశాంత్ వర్మ  పూర్తిగా యాక్షన్ కం లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నాడు సమాచారం. అంతే కాదు హనుమాన్ మూవీ  తరహాలో ఇందులో ఏదైనా సోషియో ఫాంటసీ  ఎలిమెంట్స్ పెడతారా అనేది చూడాలి. ఈ సినిమాలో బాలయ్య కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. మరోవైపు మోక్షం కోసం బాలయ్య ఇప్పటికే కొన్ని కథలను ఓకే చేసినట్టు సమాచారం త్రివిక్రమ్, కొరటాల శివ,బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి,  హరీష్ శంకర్, బాబీ వంటి టాప్ డైరెక్టర్స్ అందరు కూడా  మోక్షజ్ఞ కోసం కథలను రెడీ చేసినట్టు సమాచారం. ప్రశాంత్ వర్మతో సినిమా అయిపోగానే ఆయా దర్శకుల్లో ఎవరితో ముందుగా సినిమా చేస్తాడనేది చూడాలి.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More