Home> వినోదం
Advertisement

Nandamuri Balakrishna-Ram Charan : సంక్రాంతికి ముందు నా సినిమా చూడు.. రామ్ చరణ్‌ను బెదిరించిన బాలయ్య

Nandamuri Balakrishna Orders to Ram Charan ప్రభాస్ వచ్చే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కోసం రామ్ చరణ్‌ కూడా ఆడియో వీడియో కాల్ ద్వారా వస్తోన్న సంగతి తెలిసిందే.

Nandamuri Balakrishna-Ram Charan : సంక్రాంతికి ముందు నా సినిమా చూడు.. రామ్ చరణ్‌ను బెదిరించిన బాలయ్య

prabhas unstoppable episode బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కోసం గోపీచంద్ కూడా షోకు వచ్చాడు. ఇక ప్రభాస్ కోసం ఆడియో కాల్‌లో రామ్ చరణ్‌ సౌండ్ వినిపిస్తుంది. ఇక ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్‌ కూడా లీక్ ఇస్తాడట. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బాలయ్య, ప్రభాస్ ముచ్చట్లు ఒకెత్తు అయితే.. చివర్లో ఇచ్చిన ఝలక్ మాత్రం ఇంకో ఎత్తులా ఉంది.

ప్రభాస్‌ నుంచి సీక్రెట్లు లాగేందుకు బాలయ్య బాగానే ప్రయత్నించాడు. నువ్ డార్లింగ్ అని ప్రేమగా పిలిస్తే.. దెయ్యాలు కూడా దేవతలుగా మారుతాయ్.. పెళ్లి సంగతి ఏంటి? అని బాలయ్య అడుగుతాడు. పెళ్లి రాసి పెట్టి లేదేమో అని అంటాడు ప్రభాస్. మీ అమ్మ దగ్గర చెప్పే కబుర్లు నాకు చెప్పకు అని బాలయ్య కౌంటర్లు వేస్తాడు. ఇక బాలయ్య మరో సీక్రెట్ లాగేందుకు ప్రయత్నిస్తాడు. నువ్ అబ్బాయిలను ఏమని పిలుస్తావ్..వాళ్లు నిన్నేం పిలుస్తారు అని బాలయ్య అడుగుతాడు.

 

డార్లింగ్ అని సమాధానం చెబుతాడు. మరి గర్ల్ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు? అని బాలయ్య అడిగితే.. ఈ మధ్య సరిగ్గా గుర్తుండటం లేవు సర్ అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇక రామ్ చరణ్‌ ఆడియో కాల్‌లో వచ్చాడు. రామ్ చరణ్‌తో బాలయ్య మాట్లాడుతూ.. సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి.. అందులో ముందు నా సినిమాను చూడు.. ఆ తరువాత మీ నాన్న గారి సినిమాను చూడు అని బాలయ్య తన వీర సింహా రెడ్డి గురించి ప్రమోట్ చేసుకున్నాడు. ఇక మరి ఈ బాలయ్య ప్రశ్నకు రామ్ చరణ్‌ ఏం చెబుతాడో చూడాలి.

ఇక ప్రభాస్‌ ఎపిసోడ్‌ను రెండు పార్టులుగా విడదీసినట్టుగా ప్రకటించారు. రెండు ఎపిసోడ్‌లో ఒకటి డిసెంబర్ 30న, రెండో ఎపిసోడ్‌ను జనవరి 6న విడుదల చేయబోతోన్నారు. మరి పవన్ కళ్యాణ్‌ ఎపిసోడ్‌ను కూడా ఇలానే ప్లాన్ చేస్తారా? అన్నది చూడాలి.

Also Read : Ananya Panday pics : ప్యాంట్ మరిచిపోయిన బ్యూటీ.. అనన్య పాండే అందాల ప్రదర్శన.. పిక్స్ వైరల్

Also Read : Rashmika Mandanna : అందులో సౌత్ ఇండస్ట్రీ కంటే బాలీవుడ్ బెటర్!.. రష్మిక వ్యాఖ్యలు.. నెటిజన్ల కౌంటర్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More