Home> వినోదం
Advertisement

NBK 107 Title: బాల‌కృష్ణ తదుపరి సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌.. ఇక అభిమానులకు పూనకాలే!

Balakrishna 107 Movie Title. ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంకు 'అన్నగారు' అనే టైటిల్‌ను లాక్  చేసినట్లు సమాచారం. 

NBK 107 Title: బాల‌కృష్ణ తదుపరి సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌.. ఇక అభిమానులకు పూనకాలే!

Nandamuri Balakrishna next movie NBK 107 Title is Annagaru: 'సింహ' సినిమాతో సక్సెస్ బాట పట్టిన నందమూరి నటసింహం బాల‌కృష్ణ వరుస హిట్స్ అందుకుంటున్నారు. లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసావసూల్ లాంటి విజయాలు ఖాతాలో వేసుకున్నారు. గతేడాది అఖండ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇదే జోరును బాలయ్య బాబు త‌న తదుపరి సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నారు. ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.

'క్రాక్' సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న గోపిచంద్ మ‌లినేని.. బాల‌కృష్ణ‌తో సినిమా చేస్తుండంతో అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌లే విడుద‌లైన బాలయ్య బాబు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్పటికే జై బాలయ్య, పెద్దన్నయ్య, నటసింహం వంటి టైటిల్స్ నెట్టింట చక్కర్లు కొత్తగా.. ఇప్పుడు 'అన్నగారు' అనే టైటిల్‌ను లాక్  చేసినట్లు సమాచారం. 

ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అందులో ఒక బాలకృష్ణ 'అన్నగారు' అని, మరో బాలకృష్ణ మోడ్రన్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. సినీయ‌ర్ ఎన్టీఆర్‌ను ఆయన అభిమానులు 'అన్న‌గారు' అని ప్రేమ‌గా పిలుచుకునేవారు. అందుకే ఈ టైటిల్‌ను ఎన్బీకే 107కు పెడితే బావుంటుంద‌ని మేక‌ర్స్ ఫైన‌ల్ చేసిన‌ట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఎన్బీకే 107లో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. మోడ్రన్ బాలయ్య బాబుతో శృతి జతకట్టే అవకాశం ఉంది. క‌న్న‌డ నటుడు దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈయ‌న షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు అందిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్‌ థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Also Read: TSPSC Group 1: రేపటి నుంచే గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తులు... అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలంటే...

Also Read: SVP Trailer Leak: మహేష్ బాబుకు షాక్... సర్కారు వారి పాట ట్రైలర్ లీక్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More