Home> వినోదం
Advertisement

Balakrishna Nurse Controversy: ఈసారి నర్సులను కెలికిన బాలయ్య.. దానమ్మ భలే అందంగా ఉందంటూ!

Nandamuri Balakrishna in New Controversy: నందమూరి బాలకృష్ణ మరో సారి వివాదంలో చిక్కుకున్నారు, అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో నర్సుల గురించి ఆయన చేసిన కామెంట్లు వివాదానికి కారణం అయ్యాయి. 
 

Balakrishna Nurse Controversy: ఈసారి నర్సులను కెలికిన బాలయ్య.. దానమ్మ భలే అందంగా ఉందంటూ!

Nandamuri Balakrishna Strucked in Nurse Comments Controversy: ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ కి ముందు దేవ బ్రాహ్మణుల దేవుడు రావణాసురుడు అంటూ కామెంట్ చేసిన ఆయన తర్వాత క్షమాపణలు చెబుతూ ఒక లేఖ విడుదల చేశారు. తర్వాత వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని ఎండు కామెంట్లు చేయడంతో పెద్ద వివాదం రేగింది. అదేవిధంగా రంగారావుని ఆ రంగారావు ఈ రంగారావు అనే అవమానించారని కాపునాడు అనే సంస్థ కూడా అల్టిమేటం జారీ చేసింది.

అయితే ఆ వివాదాలన్నీ సద్దుమణిగాయి అనుకుంటున్న తరుణంలో మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్ తో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఒకటి చేశారు. దానికి సంబంధించిన మొదటి భాగం విడుదలైంది.  ఈ మొదటి భాగంలో ఆయన నర్సుల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ నర్సులు సంక్షేమ సంఘం ఇప్పుడు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ స్టాపబుల్ ఎపిసోడ్ విత్ ఎన్బీకే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఏ మాత్రం బాలేదని ఏపీ నర్సుల సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ షోలో బాలకృష్ణ గతంలో తనకు దొరికిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఆ సమయంలో తనకు ట్రీట్మెంట్ చేసిన నర్స్ గురించి వ్యాఖ్యలు చేశారు. ఆ నర్సు దానమ్మ భలే అందంగా ఉందిలే అంటూ పవన్ కళ్యాణ్ తో సరదాగా కామెంట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏపీ నర్సుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని ఆయన నర్స్ లందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

అయితే బాలయ్య అభిమానులు ఈ విషయం మీద ఫైర్ అవుతున్నారు కావాలనే బాలకృష్ణ మాట్లాడిన అన్ని మాటల్లో ఏదో ఒక తప్పుడు అర్థం వెతికి ఇలా దాడి చేస్తున్నారని అంటున్నారు. ఆయన రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా యాక్టివ్ గా ఉండటమే దానికి కారణమని కావాలని వివాదాల సృష్టించాలని అనుకుంటే తాము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అంటున్నారు. బాలకృష్ణ స్వయంగా బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి చైర్మన్ అని ఆయన నర్సులను డాక్టర్లను ఎంతో గౌరవంగా చూసుకుంటారని ఏదో షోలో సరదాగా అన్నదానికి ఇలా చిలువలు, కొలవలు చేస్తూ డిమాండ్లు చేయడం అల్టిమేటం జారీ చేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయం మీద బాలకృష్ణ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Pooja Hegde Struggling: 'పూజా'కొక తెలుగు సినిమా కావలెను!

Also Read: Bigg Boss’s Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ విషయంలో షాక్.. అసలు సంగతి అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
 
Read More