Home> వినోదం
Advertisement

Sitara School Graduation: కొత్త దశలోకి సితారా.. కూతుర్ని చూసి మురిసిపోతోన్న నమ్రత, మహేష్ బాబు

Sitara Graduating to Secondary School: సితారా సెకండరీ స్కూల్‌కు గ్రాడ్యుయేట్ అవుతోందని నమ్రత మురిసిపోయింది. ఈ మేరకు స్కూల్‌లో సితార పట్టా తీసుకున్న విజువల్స్‌ను నమత్ర షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Sitara School Graduation: కొత్త దశలోకి సితారా.. కూతుర్ని చూసి మురిసిపోతోన్న నమ్రత, మహేష్ బాబు

Sitara Graduating to Secondary School: మహేష్‌ బాబు ఫ్యామిలీకి సోషల్ మీడియాలో ఎంతక్రేజ్ ఉందో తెలిసిందే. నమ్రత ఎప్పుడూ కూడా మహేష్‌ బాబు, సితార, గౌతమ్‌ల గురించి పోస్టులు చేస్తూనే ఉంటుంది. వారికి సంబంధించిన ఏ ప్రత్యేకమైన సందర్భం ఉన్నా కూడా నమ్రత వదిలి పెట్టదు. పోస్టులు చేస్తుంటుంది. అభిమానులుకు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. అంతే కాకుండా మహేష్‌ బాబు సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చెబుతుంటుంది. మహేష్‌ బాబు ఫౌండేషన్ కార్యక్రమాలను నమ్రత చూసుకుంటుందన్న సంగతి తెలిసిందే.

నమ్రత ఇప్పుడు తన కూతురు సితార ఎదుగుతున్న తీరుని చూసి మురిసిపోయింది. సెకండరీ స్కూల్‌కు గ్రాడ్యుయేట్ అవుతోందని చెబుతూ సంబరపడిపోయింది. ఈ క్రమంలో స్కూల్‌ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో మహేష్‌ బాబు, నమ్రతలు సందడి చేశారు. ఈ క్రమంలో సితార స్కూల్‌లో పట్టా తీసుకుంటూ ఉన్న విజువల్స్‌ను షేర్ చేసింది.

నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.. నా పాత రోజులన్నీ గుర్తుకు వస్తున్నాయి.. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న నువ్.. ఇప్పుడు కొత్త దశలోకి వెళ్తున్నావ్.. సెకండరీ స్కూల్‌కు గ్రాడ్యుయేట్ అవుతున్నందుకు కంగ్రాట్స్.. నువ్ అడుగు పెట్టిన ప్రతీ చోట నీ కష్టంతో వెలిగిపోవాలని కోరుకుంటున్నాను.. రానున్న రోజుల్లో నువ్ సాధించబోయే విజయాలకు ఆల్ ది బెస్ట్.. నాన్న, అన్నయ్య, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం.. ఇప్పటి వరకు సితారకు తోడ్పాటు అందించిన టీచర్లకు థాంక్స్ అని నమ్రత ఎమోషనల్ అయింది.

గత ఏడాది గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే నాడు స్కూల్‌లో వేసిన నాటకానికి సంబంధించిన వీడియోను నమ్రత షేర్ చేసిన సంగతి తెలిసిందే. స్కూల్‌ ట్రిప్ కోసం గౌతమ్ విదేశాలకు మొదటి సారిగా వెళ్లాడంటూ, ఇలా ఒంటరిగా పంపించడం ఇదే ఫస్ట్ టైం అంటూ నమ్రత ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. అన్నయ్య లేకపోవడంతో బోర్ కొడుతోందని, మిస్ యూ అంటూ సితార సైతం పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.

Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్

Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More