Home> వినోదం
Advertisement

Nagarjuna Lakshmi Daggubati Wedding : రేర్ పిక్.. నాగార్జున-లక్ష్మీ దగ్గుబాటి పెళ్లి ఫోటో.. నెటిజన్ల కామెంట్లు వైరల్

Nagarjuna Lakshmi Daggubati Wedding pic Viral  నాగార్జున లక్ష్మీ దగ్గుబాటి పెళ్లి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పెళ్లి ఫోటోలో నాగార్జున అచ్చం నాగ చైతన్యలానే కనిపిస్తున్నాడని అంటున్నారు.

Nagarjuna Lakshmi Daggubati Wedding : రేర్ పిక్.. నాగార్జున-లక్ష్మీ దగ్గుబాటి పెళ్లి ఫోటో.. నెటిజన్ల కామెంట్లు వైరల్

Nagarjuna Lakshmi Daggubati Wedding : టాలీవుడ్ కింగ్ నాగార్జున పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. నాగార్జున మొదటి పెళ్లి, విడాకులు, రెండో పెళ్లి గురించి అందరికీ తెలిసిందే. నాగార్జున దగ్గుబాటి వంశానికి అల్లుడు. వెంకటేష్ సోదరి లక్ష్మీ దగ్గుబాటిని నాగార్జున వివాహాం చేసుకున్నాడు. ఈ ఇద్దరికి నాగ చైతన్య జన్మించాడు. అయితే అమలతో ప్రేమలో పడ్డ నాగార్జున.. లక్ష్మీతో విడాకులు తీసుకున్నాడు.

అలా దగ్గుబాటికి అక్కినేనికి కాస్త గ్యాప్ ఏర్పడింది. కానీ నాగ చైతన్య మాత్రం అటు దగ్గుబాటి ఫ్యామిలీతో, ఇటు అక్కినేని ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. నాగ చైతన్య తల్లి లక్ష్మీ మాత్రం చెన్నైలోనే ఉంటుంది. నాగ చైతన్య పెళ్లి సమయంలోనే ఎక్కువగా బయటకు వచ్చింది. మళ్లీ ఇంత వరకు లక్ష్మీకి సంబంధించిన వార్తలు రాలేదు.

 

అయితే తాజాగా నాగార్జున లక్ష్మీ దగ్గుబాటికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. నాగార్జున లక్ష్మీ దగ్గుబాటిల పెళ్లి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పెళ్లి సమయంలో నాగార్జున ప్రస్తుతం నాగ చైతన్య కనిపిస్తున్నట్టుగానే ఉన్నాడు. ఈ మేరకు అక్కినేని అభిమానులు ఈ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.

లైక్ ఫాదర్.. లైక్ సన్ అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి నాగార్జున మొదటి పెళ్లి ఫోటో మాత్రం జనాలను తెగ ఆకట్టుకుంటోంది. 1984లో ఈ పెళ్లి జరగ్గా.. 1990లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నాగార్జున మళ్లీ అమలను 1992లో పెళ్లి చేసుకున్నాడు.

నాగార్జున రీసెంట్‌గా ది ఘోస్ట్ సినిమాతో  ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కమర్షియల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసినట్టు అయింది.

Also Read : RC 15 : దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్

Also Read : poovaiyar Buys New Car : 'మాస్టర్' బుడ్డోడు.. కారుకు ఓనర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More