Home> వినోదం
Advertisement

Watch Nagarjuna taking charter flight: బిగ్ బాస్ 4 తెలుగు షూటింగ్ కోసం చార్టర్ ఫ్లైట్‌లో నాగ్

Nagarjuna back to hyderabad for Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో హోస్ట్ కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలి ( Nagarjuna in Manali ) వెళ్లడంతో గత వారం ఆ బాధ్యతని నాగ్ కోడలు అక్కినేని సమంత చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. హోస్ట్‌గా అనుభవం లేకపోయినా.. తెలుగు మాట్లాడటం అంతగా రాకపోయినా సమంత ( Samantha Akkineni ) ధైర్యంగా ముందడుగేసి దసరా సందర్భంగా బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరించింది.

Watch Nagarjuna taking charter flight: బిగ్ బాస్ 4 తెలుగు షూటింగ్ కోసం చార్టర్ ఫ్లైట్‌లో నాగ్

Nagarjuna back to hyderabad for Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో హోస్ట్ కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలి ( Nagarjuna in Manali ) వెళ్లడంతో గత వారం ఆ బాధ్యతని నాగ్ తన కోడలు అక్కినేని సమంత చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. హోస్ట్‌గా అనుభవం లేకపోయినా.. తెలుగు మాట్లాడటం అంతగా రాకపోయినా సమంత ( Samantha Akkineni ) ధైర్యంగా ముందడుగేసి దసరా సందర్భంగా బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరించి పండగ రోజు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచి అందరిని ఆకట్టుకుంది. Also read : Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో జంటల మధ్య టైటిల్స్ చిచ్చు

ఇక ఈ వీకెండ్‌లో హోస్ట్‌గా ఎవరు చేయబోతున్నారు.. మళ్లీ సమంతనే హోస్ట్‌గా చేయబోతోందా అని వారం మొదటి నుండే అభిమానుల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే గత వారం మూడు గంటల ఎపిసోడ్ షూటింగ్ చేయడానికి సుమారు 10 నుండి 12 గంటల పాటు సమయం పట్టిందంట. దీంతో ఈ వారం బిగ్ బాస్‌కి హోస్ట్ చేయడం తన వల్ల కాదు అని సమంత చేతులెత్తేయడంతో ఈ వీకెండ్ ఎపిసోడ్ హోస్ట్ చేయడానికి నాగ్ హైదరాబాద్ వచ్చేశాడు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

King is back in style for #BiggBossTelugu4 shoot Today at 9 PM on @StarMaa

A post shared by STAR MAA (@starmaa) on

మనాలిలో వైల్డ్ డాగ్ షూటింగ్ ( Wild dog shooting in Manali ) లొకేషన్ నుండి హెలికాప్టర్‌లో మనాలి అందాలను చూపిస్తూ దగ్గరలో ఉన్న విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చార్టర్ ఫ్లైట్‌లో బయల్దేరి హైదరాబాద్ చేరుకొన్న నాగ్.. ఆ తర్వాత తనదైన స్టైల్లో బిగ్ బాస్ షూటింగ్‌ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. Also read : Bigg Boss Telugu 4: కొత్త కెప్టెన్‌గా అరియానా.. ఫీల్ అవుతున్న లాస్య, హారిక

ఈ వీడియోను తాజాగా స్టార్ మా "బిగ్‌బాస్ కోసం కింగ్ ఈజ్ బ్యాక్" అనే క్యాప్ష‌న్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు.. ఇంటిస‌భ్యుల గురించి నాగార్జున ఏం మాట్లాడ‌తారో చూడాల‌ని ఉందంటూ ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. Also read : Singer Noel: బిగ్ బాస్ 4 హౌస్‌ను వీడిన సింగర్ నోయల్.. రీఎంట్రీ ఉంటుందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More