Home> వినోదం
Advertisement

Naga Shaurya New Movie : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ లుక్

Phalana Abbayi Phalana Ammayi first look పలానా అబ్బాయి పలానా అమ్మాయి సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్లు విడుదల చేశారు.

Naga Shaurya New Movie : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ లుక్

Phalana Abbayi Phalana Ammayi first look నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే నాగ శౌర్య మాత్రం తన స్టైల్ మూవీస్‌ను వదలడం లేదు. లక్ష్య, వరుడు కావలెను, కృష్ణా వ్రిందా విహారీ అంటూ ఇలా కొత్తగా ట్రై చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'తో నాగ శౌర్య, శ్రీనివాస్ అవసరాల మరోసారి కలిశారు. ఇది వరకు వీరి కాంబోలో ఊహలు గుసగుసలాడే సినిమా వచ్చింది. ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో మెప్పించేందుకు వస్తున్నారు.

మరో వైపు 'కళ్యాణ వైభోగమే' చిత్రంతో నాగశౌర్య, మాళవిక నాయర్ మెప్పించగా.. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. నాగ శౌర్య, మాళవిక నాయర్ ఇద్దరూ ఫార్మల్ వింటర్‌వేర్ ధరించి, ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపించారు.

పోస్టర్‌ను చూస్తుంటే ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. గతంలో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కాంబో అనగానే మంచి పాటలు గుర్తుకు వస్తుంటాయి. అయితే ఇప్పుడు కూడా మళ్లీ వారికి కలిసి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్‌నే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More