Home> వినోదం
Advertisement

Naga Chaitanya: సమంతతో విడాకులపై నాగ చైతన్య తొలి స్పందన- ఏమన్నారంటే..

Naga Chaitanya: సమంతతో విడాకుల గురించి తొలిసారి స్పందించారు అక్కినేని నాగ చైతన్య. బంగార్రాజు సినిమా ప్రమోషన్​లో ఈ విషయం గురించి మాట్లాడారు.

Naga Chaitanya: సమంతతో విడాకులపై నాగ చైతన్య తొలి స్పందన- ఏమన్నారంటే..

Naga Chaitanya: టాలీవుడ్​లో కొన్నాళ్లపాటు హాట్​టాపిగ్​గా మారిన విషయం నాగచైతన్య, సమంత విడాకులు (Naga chaitanya Samanth divorce). ఇద్దరూ ఆ నిర్ణయం గురించి ప్రకటించిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారారు. విడాకులు తీసుకున్న మంచి స్నేహితులుగా ఉంటామని మాత్రం వెల్లడించారు.

విడాకుల తర్వాత సమంత చాలా సార్లు ఈ విషయంపై స్పందించారు. ఎన్నో సార్లు ఎమోషనల్​గా కూడా తన పరిస్థితిని (Samantha on her Divorce) వివరించారు. అయినప్పటికీ ప్రశ్నలు ఎదురవడంతో.. చివరకు తాను ఇక ఈ విషయంపై స్పందించబోనని కూడా స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా నాగ చైతన్య మాత్రం ఈ విషయం గురించి ఎప్పుడు బహిరంగంగా మాట్లాడలేదు. సోషల్ మీడియాలోనూ ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదు.

నాగ చైతన్య తొలి స్పందన ఇదే..

తాజాగా నాగ చైతన్య తొలిసారి సమంతతో విడాకుల గురించి పెదవి విప్పారు. ఇది ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమని.. ఇద్దరి మంచి కోసమే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని (Naga Chaitanya on his divorce) చెప్పారు. విడాకుల తర్వాత ఇద్దరు సంతోషంగానే ఉన్నట్లు వెల్లడించారు.

బంగార్రాజు ప్రమోషన్లో ఎదురైన ప్రశ్న..

నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా ఈ నెల 14న విడుదల (Bangarraju release date) కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్​ ప్రమోషన్లలో బిజీగా (Bangarraju promotion) ఉంది. ఇందులో భాగంగానే.. ఓ చోట నాగ చైతన్యకు విడాకుల గురించిన ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సమధానంగానే పై వివరణ ఇచ్చారు చైతన్య.

Also read: Naga Chaitanya viral Video : డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటోన్న చై.. సోషల్ మీడియాలో వీడియోల హల్‌చల్

Also read: Indian Idol: తెలుగులో ఇండియన్ ఐడల్, న్యాయ నిర్ణేతగా తమన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More