Home> వినోదం
Advertisement

Akanksha Dubey Death: నటి మృతి కేసు.. సింగర్ అరెస్ట్.. CC ఫుటేజ్ లో ఉన్న ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు..?

Akanksha Dubey Suspicious Death Case: భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే అనుమానాస్పద మృతి కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఆమె చనిపోవడానికి కొద్ది సమయం ముందు ఒక వ్యక్తితో కలిసి సీసీ కెమెరా కంట పడింది.

Akanksha Dubey Death: నటి మృతి కేసు.. సింగర్ అరెస్ట్.. CC ఫుటేజ్ లో ఉన్న ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు..?

Who is Mysterious Person in Akanksha Dubey Suspiciuos Death Case: భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే అనుమానాస్పద మృతి కేసులో అనేక సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే భోజ్ పురి పరిశ్రమకు చెందిన ప్రముఖ సింగర్ సమర్ సింగ్ మూడు రోజుల క్రితమే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే భోజపురి నటి అయిన ఆకాంక్ష దూబే వారణాసి వెళ్లి అక్కడే ఒక హోటల్ లో ఉరి వేసుకుని మరణించారు.

ఈ నేపథ్యంలో సదరు హోటల్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే ఒక సినిమా షూటింగ్లో పాల్గొనేందుకుగాను వారణాసి వెళ్లారు. అక్కడే సినిమా యూనిట్ కేటాయించిన ఒక హోటల్లో ఉంటూ షూటింగ్ కి వెళుతూ ఉండేవారు.

మార్చి 26వ తేదీన షూటింగ్ కి వెళ్లి వచ్చిన ఆమె హోటల్ కి వచ్చి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయాన్ని తర్వాత రోజు ఉదయం హోటల్ స్టాఫ్ గుర్తించి ఆమె పర్సనల్ స్టాఫ్ కి సమాచారం అందించడంతో వెలుగులోకి వచ్చింది. ఇక ఆమె హోటల్ లోకి వెళ్లడానికంటే ముందు ఒక గుర్తు తెలియని వ్యక్తితో మాట్లాడినట్లు హోటల్ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఆ వ్యక్తి ఆకాంక్ష వస్తువులు కూడా మోసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆ కనిపించిన వ్యక్తి ఎవరు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

Also Read: Prabhas as Oldman: ముసలోడిలా మారుతున్న ప్రభాస్.. ఏం మాయ చేశాడో?

అయితే ఆకాంక్ష కుటుంబ సభ్యులు మాత్రం సమర్ సింగ్, సంజయ్ సింగ్ ల మీదే తమ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన వ్యక్తి ఎవరు? అతనికి ఆకాంక్ష అనుమానాస్పద మృతికి ఏదైనా సంబంధం ఉందా? అనే విషయం మీద ఆ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఇక టిక్ టాక్ ద్వారా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకున్న ఆకాంక్ష దూబే సినిమా అవకాశాలు దక్కించుకుంది. అయితే భోజ్ పురి సింగర్ సమర్ సింగ్ తో ప్రేమాయణం వల్లే ఆమెకు అవకాశాలు వచ్చాయని మరో ప్రచారం కూడా ఉంది. 

Also Read: Ravanasura Collections: దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. భారీ డిజాస్టర్ దిశగా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
Read More