Home> వినోదం
Advertisement

AR Rahman: రచయితగా, నిర్మాతగా మారుతున్న ఏఆర్ రెహమాన్

AR Rahman: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ రచయితగా మారారు. జియో స్టూడియోస్, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ చిత్రం 99 సాంగ్స్ త్వరలో మూడు భాషల్లో విడుదల కానుంది.
 

AR Rahman: రచయితగా, నిర్మాతగా మారుతున్న ఏఆర్ రెహమాన్

AR Rahman: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ రచయితగా మారారు. జియో స్టూడియోస్, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ చిత్రం 99 సాంగ్స్ త్వరలో మూడు భాషల్లో విడుదల కానుంది.

నిన్నటి వరకూ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్.రేపటి నుంచి రచయితగా, నిర్మాతగా మారనున్నారు. ఆయనే ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman). ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో రూపొందిన ప్రేమకథాచిత్రం 99 సాంగ్స్(99 Songs movie). త్వరలో ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16న విడుదల కానుంది. బ్యూటిఫుల్ విజువల్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు సినీ ఇండస్ట్రీకు పరిచయం కాబోతున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సహ రచయితగా వర్క్ చేశారు. 

ఇహాన్ భట్ అనే నటుడు ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాపై ఇటు ఏఆర్ రెహమాన్ కూడా మాట్లాడారు. తన నిర్మాణ సంస్థ వైఎం మూవీస్ తో పాటు జియో స్టూడియోస్‌తో కలిసి 99 సాంగ్స్ సినిమా నిర్మాణంలో భాగంగా ఉందని తెలిపారు. పాత తరానికి, కొత్త తరానికి మధ్య మానసిక సంఘర్షణను అనుభవించే ఓ మనిషి కధే ఈ సినిమా. 

Also read: Anushka Shetty, Naveen Polishetty: నవీన్ పొలిశెట్టితో అనుష్క రొమాన్స్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More