Home> వినోదం
Advertisement

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు, ఎన్సీబీ అధికారి ఢిల్లీకు

Aryan Khan Drugs Case: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై ఆరోపణల నేపధ్యంలో ఆయన ఢిల్లీకు వెళ్లడం సంచలనం కల్గిస్తోంది. అసలేం జరుగుతోంది ఈ కేసులో.
 

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు, ఎన్సీబీ అధికారి ఢిల్లీకు

Aryan Khan Drugs Case: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై ఆరోపణల నేపధ్యంలో ఆయన ఢిల్లీకు వెళ్లడం సంచలనం కల్గిస్తోంది. అసలేం జరుగుతోంది ఈ కేసులో.

ముంబాయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో(Mumbai Cruise Ship Drugs Case) ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. అక్టోబర్ 2న అరెస్టైన ఆర్యన్ ఖాన్..అప్పట్నింటి అర్ధర్ రోడ్ జైళ్లో ఉన్నాడు. మూడుసార్లు బెయిల్ కోసం విఫలయత్నాలు జరిగాయి. ఇవాళ మరోసారి బెయిల్‌పై విచారణ జరగనుంది. మరోవైపు ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై తీవ్రమైన ఆరోపణలు సంచలనం కల్గించాయి. ఆర్యన్ ఖాన్‌ను(Aryan Khan)వదిలేయాలంటే 25 కోట్లు డిమాండ్ చేశారనేది ఆ ఆరోపణ. ఈ ఆరోపణలు చేసింది కూడా ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సాయిల్. క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ లభించాయనే పంచానామా పత్రంపై సాక్షిగా ఉన్నది ఇతడే. అతడే ఈ ఆరోపణలు చేయడంతో సంచలనం రేగుతోంది. ఈ క్రమంలో సమీర్ వాంఖడేపై విచారణ చేస్తున్నట్టు ఎన్‌సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. విచారణకు ఆదేశించామని..సమీర్ వాంఖడే ఆ పదవిలో కొనసాగుతారో లేదా అనేది చెప్పలేమని అన్నారు. 

సరిగ్గా ఇదే సమయంలో నిన్న సాయంత్రం సమీర్ వాంఖడే (Sameer Wankhede)హఠాత్తుగా ఢిల్లీకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమీర్ వాంఖడే స్పందించారు. ఏ దర్యాప్తు సంస్థ నుంచి తనకు సమన్లు అందలేదన్నారు. పని మీద ఢిల్లీ వచ్చినట్టు..కేసు దర్యాప్తుకు 100 శాతం కట్టుబడి ఉన్నానని చెప్పారు. మరోవైపు సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. క్రూయిజ్ షిప్ నుంచి డ్రగ్స్ రికవరీకు సంబంధించిన కేసు నకిలీగా ఆరోపించారు. బీజేపీ, ఎన్సీబీలు(NCB)ముంబైలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్నారు. ఆయన పుట్టుకకు సంబంధించి పత్రాల్ని కూడా లీక్ చేస్తూ..అసలు ఫోర్జరీ ఈ పత్రాల్నించే ప్రారంభమైందన్నారు మంత్రి నవాబ్ మాలిక్(Nawab Malik).దాంతో ఈ విషయంపై తిరిగి సమీర్ వాంఖడే స్పందించారు. వ్యక్తిగత పత్రాల్ని ప్రచురిస్తూ పరువు నష్టం కల్గిస్తున్నారన్నారు. కుటుంబ గోప్యతపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు అఫిడవిట్ సైతం సమర్పించారు. 

Also read: Aryan Khan Case: ఈ రోజే నాలుగో సారి ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ.. బెయిల్ వస్తుందా..? రాదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More