Home> వినోదం
Advertisement

Bhagyashri: ప్యాన్ ఇండియా సినిమా సొంతం చేసుకున్న రవితేజ హీరోయిన్.. అదృష్టంపై అదృష్టం!

Bhagyashri Borse Upcoming Movies: రవితేజ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో.. విడుదల కాబోతున్న..మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది భాగ్యశ్రీ. ఈ సినిమా విడుదల కాకముందే.. ఈమె మరొక క్రేజీ ఆఫర్ అందుకుంది. త్వరలోనే ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించడానికి.. సిద్ధం అవుతుంది.

Bhagyashri: ప్యాన్ ఇండియా సినిమా సొంతం చేసుకున్న రవితేజ హీరోయిన్.. అదృష్టంపై అదృష్టం!

Mr Bachchan Heroine: మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయం కాబోతోంది. సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు కానీ అప్పుడే ఆమెపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. 

తాజా సమాచారం ప్రకారం భాగ్యశ్రీ బోర్సేకి అప్పుడే బోలెడు ఆఫర్లు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యనే మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ కూడా ఒక కొలిక్కి వచ్చేసింది. కొంత టాకీ పార్ట్, ఒకటి రెండు పాటలు తప్ప మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు త్వరలోనే సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించనున్నారు. 

మరోవైపు భాగ్యశ్రీ బోర్సే సినిమా విడుదలకి ముందే ఆఫర్లు అందుకుంటుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమా VD12 లో హీరోయిన్ గా నటించే అవకాశం భాగ్యశ్రీ బోర్సేకి దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన..ఇంకా వెలువడలేదు.. కానీ భాగ్యశ్రీ సినిమాకి ఆల్రెడీ సైన్ చేసేసింది అని టాక్ ఉంది. 

మరోవైపు చిత్ర బృందం సినిమాకి సంబంధించిన అప్డేట్లను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇదిలా ఉండగా సినిమా ప్రకటించినప్పుడు శ్రీ లీలని హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఆ తర్వాత వేరే కారణాలవల్ల ఆమెను తీసేసి ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని వెతికారని తెలుస్తోంది. 

సత్వదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకుండా ఎన్ని ఆఫర్లు అందుకుంటున్న భాగ్యశ్రీ ఈ సినిమాలతో.. ఎంతవరకు మంచి పేరు తెచ్చుకుంటుందో చూడాలి.

Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..

Read more: Snake bite: పగ పట్టిన పాము..?.. ఆరేళ్లలో ఆరుసార్లు కాటుకు గురైన మహిళ.. అసలు స్టోరీ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More