Home> వినోదం
Advertisement

Video: మదర్స్ డే స్పెషల్... తల్లి అంజనా దేవితో మెగా బ్రదర్స్ ఎమోషనల్ మూమెంట్స్...


Mega Brothers Mothers Day Special Video: మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మెగా బ్రదర్స్ ముగ్గురు కలిసి తల్లి అంజనా దేవితో గడిపిన ఎమోషనల్ మూమెంట్స్‌‌ను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు.

Video: మదర్స్ డే స్పెషల్... తల్లి అంజనా దేవితో మెగా బ్రదర్స్ ఎమోషనల్ మూమెంట్స్...

Mega Brothers Mothers Day Special Video: మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్... ఈ ముగ్గురూ ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది. ఫ్యాన్స్‌కైతే చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. మదర్స్ డే సందర్భంగా ఈ ముగ్గురు అన్నాదమ్ములు తల్లి అంజనా దేవీతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అమ్మలందరికీ మదర్స్ డే విషెస్ చెబుతూ... తల్లి అంజనా దేవితో గడిపిన క్షణాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మెగా బ్రదర్స్ ముగ్గురు షూటింగ్ స్పాట్‌లో ఉండగా తల్లి అంజనా దేవి అక్కడికి వెళ్లారు. నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. కాసేపు నవ్వుతూ సంతోషంగా గడిపారు. అనంతరం అంజనా దేవిని దగ్గరుండి కారెక్కించారు. ఈ సందర్భంగా నలుగురు కలిసి దిగిన కొన్ని ఫోటోలను వీడియోకి జత చేశారు. ఇవాళ మదర్స్ డే కావడంతో తల్లితో గడిపిన ప్రత్యేక క్షణాలను మెగా బ్రదర్స్ ఇలా వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు.

ఈ వీడియో చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. ఇంటికి పెద్ద కొడుకంటే మీలా ఉండాలి అంటూ చిరంజీవిని కొనియాడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. చిరంజీవి ఈ వీడియోని పోస్టు చేసిన 3 గంటల్లోనే 2 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. 

సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన చిరంజీవి 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షోకే ఈ సినిమా నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. దీంతో దర్శకుడు కొరటాల శివకు ఫస్ట్ ఫ్లాప్ ఎదురైనట్లయింది. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'బోళా శంకర్', మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' బాబీ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.

Also Read: Disha Patani: ప్రభాస్‌ సినిమాలో మరో బాలీవుడ్‌ భామ.. వెల్‌క‌మ్ చెపుతూ ఫ్ల‌వ‌ర్ బొకే!

Also Read: Rahul Ramakrishna: కాబోయే భార్యకు ముద్దు... త్వరలో పెళ్లి... అర్జున్ రెడ్డి నటుడి ఫోటో వైరల్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Read More