Home> వినోదం
Advertisement

క్యాన్సర్‌తో యువ నటుడి మృతి

బాలీవుడ్‌లో తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మెహిత్ బఘేల్ (26) ( Mohit Baghel ) ఇక లేరు. గతేడాది డిసెంబర్ నుంచి క్యాన్సర్‌తో ( Cancer ) బాధపడుతూ ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో చికిత్స పొందుతున్న మోహిత్ అదే వ్యాధితో కన్నుమూశారు.

క్యాన్సర్‌తో యువ నటుడి మృతి

బాలీవుడ్‌లో తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మెహిత్ బఘేల్ (26) ( Mohit Baghel ) ఇక లేరు. గతేడాది డిసెంబర్ నుంచి క్యాన్సర్‌తో ( Cancer ) బాధపడుతూ ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో చికిత్స పొందుతున్న మోహిత్ అదే వ్యాధితో కన్నుమూశారు. చోటే మియా ( Chote Miyaan ) అనే కామెడీ షోతో కెరీర్ ప్రారంభించిన మోహిత్ ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన రెడీ, సిద్ధార్థ్ మల్హోత్రా-పరిణీతి చోప్రా జంటగా తెరకెక్కిన జబారియా జోడి లాంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రాతో మరో సినిమాకు సంబంధించిన షూటింగ్ సైతం పూర్తి చేసుకున్నాడు. అప్‌కమింగ్ సినిమా బంటీ ఔర్ బబ్లీ-2 సినిమాలోనూ మోహిత్ నటించాల్సి ఉండే. Nagababu`s tweet : మహాత్మా గాంధీపై మరో ట్వీట్ చేసిన నాగబాబు )

मोहित मेरे भाई इतनी जल्दी क्या थी जाने की?
मैंने तुझसे कहा था देख तेरे लिए सारी इंडस्ट्री रुक गयी है जल्दी से ठीक होके आजा उसके बाद ही सब काम शुरू करेंगे,
तू बहुत अच्छी एक्टिंग करता है,इसलिए अगली फिल्म के सेट पे तेरा इंतज़ार करूँगा...और तुझे आना ही पड़ेगा
ॐ साई राम
#cancer RIP pic.twitter.com/FD2lE3tHJz

— Raaj Shaandilyaa (@writerraj) May 23, 2020

 

 

మోహిత్ మరణ వార్తను ప్రముఖ దర్శకుడు రాజ్ శాండిల్య ట్విటర్ ద్వారా అందరితో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. నీకోసం పరిశ్రమంతా పని మానేసుకుని కూర్చుందని.. నువ్వొచ్చాకే అందరూ సినిమా షూటింగ్స్ మొదలుపెడతారని నీకు ముందే చెప్పానుగా. అయినా సరే అప్పుడే తొందరపడి ఎందుకు వెళ్లిపోయావు మోహిత్ అంటూ రాజ్ శాండిల్య హిందీలో రాసుకొచ్చిన ట్వీట్ అందరి హృదయాలను కదిలించింది. అలనాటి తార వాణిశ్రీ కుమారుడు మృతి )

One of the nicesttt people to work with! Happy, positive and motivated always. Love you Mohit. RIP🤎 #JabariyaJodi https://t.co/b0Gr6GpCxg

— Parineeti Chopra (@ParineetiChopra) May 23, 2020

 

 

Really shocked to hear this news.. Mohit was such a young, happy, funny & talented guy.. we just shot a whole film together! Upsetting news, my prayers with his family 🙏 https://t.co/oGBYivByYO

— Sidharth Malhotra (@SidMalhotra) May 23, 2020

 

 

 

మోహిత్ ఇక లేరని తెలుసుకుని అతడితో కలిసి నటించిన సిద్ధార్థ్ మల్హోత్రా, పరిణీతి చోప్రా లాంటి నటీనటులు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మోహిత్ ఎంతో చురుకైన యువకుడని.. ఎంతో నవ్విస్తూ అందరితో సరదాగా గడిపే టాలెంటెండ్ ఆర్టిస్ట్ మోహిత్ ఇలా తనువు చాలించడం బాధాకరం అని బాలీవుడ్ ప్రముఖులు ట్వీటర్ ద్వారా తమ సంతాపం ప్రకటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

 

Read More