Home> వినోదం
Advertisement

Neru Trailer: దృశ్యం కాంబో రిపీట్.. ఇంట్రెస్టింగ్ గా మోహన్‌లాల్ 'నెరు' ట్రైలర్..

Mohan Lal new Movie: ఎప్పుడు కొత్త కొత్త కథలతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటాడు మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్. ఆయన నయా మూవీ నెరు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల అయింది. 
 

Neru Trailer: దృశ్యం కాంబో రిపీట్.. ఇంట్రెస్టింగ్ గా మోహన్‌లాల్ 'నెరు' ట్రైలర్..

Neru Trailer Released: మ‌ల‌యాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohan Lal) టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం నెరు(Neru). దృశ్యం, దృశ్యం 2 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అందించిన జీతూ జోసెఫ్ (Jeethu Joseph) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్, టీజర్ ఆడియెన్స్ లో ఎనలేని హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ చేశారు మేకర్స్. ఇందులో విజయ్‌ మోహన్‌ అనే లాయర్ గా మోహన్‌లాల్ నటిస్తున్నాడు. చాలా రోజులుగా కేసులు వాదించ‌ని ఓ లాయర్ స‌డ‌న్‌గా ఒక కేసు కోసం మ‌ళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అనేది స్టోరీ. ఇందులో ప్రియమణి కీలకపాత్రలో నటిస్తోంది. 

జీతూ జోసెఫ్-మోహన్‌లాల్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచనాలు సృషిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఈ చిత్రాన్ని స‌లార్, డంకీల‌కు పోటిగా డిసెంబర్ 21న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు మోహన్‌లాల్ లూసిఫర్ రీమేక్ 'ఎల్2ఇ:ఎంపురాన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అంతేకాకుండా మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో కూడా ఓ సినిమా రాబోతుంది. అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు కూడా. మరోవైపు మంచు విష్ణు నటిస్తున్న కన్నప్పలో కూడా ఓ కీలకపాత్ర చేస్తున్నారు మోహన్ లాల్. 

Also Read: Vidyut Jammwal: హిమాల‌యాల్లో న‌గ్నంగా బాలీవుడ్ యాక్టర్, ఫోటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More