Home> వినోదం
Advertisement

Mohan Babu: ‘సన్నాఫ్ ఇండియా’గా కలెక్షన్ కింగ్

టాలీవుడ్ ప్రసిద్ధ హీరో, కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ( Mohan Babu ) 500లకు పైగా చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా.. ప్ర‌తి నాయ‌కుడిగా.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా నటించి తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. హీరోగా రాణించడమే కాకుండా నిర్మాత‌గా కూడా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు.

Mohan Babu: ‘సన్నాఫ్ ఇండియా’గా కలెక్షన్ కింగ్

Son of India: టాలీవుడ్ ప్రసిద్ధ హీరో, కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ( Mohan Babu ) 500లకు పైగా చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా.. ప్ర‌తి నాయ‌కుడిగా.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా నటించి తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. హీరోగా రాణించడమే కాకుండా నిర్మాత‌గా కూడా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ మ‌ధ్య కాలంలో మోహ‌న్‌బాబు సినిమాల‌ను చాలా ఆచితూచి ఎంచుకుంటూ వ‌స్తున్నారు. మోహన్ బాబు చివరిసారి ‘గాయత్రి’ సినిమాలో హీరోగా నటించారు. ఆ తరువాత ‘మహానటి’ సినిమాలో ఎస్వీఆర్ పాత్రలో కనిపించారు. అయితే స్వాతంత్ర్య దినోత్స‌వం ( independence day ) సంద‌ర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాను చేయ‌బోతున్న కొత్త చిత్రం ‘‘సన్నాఫ్ ఇండియా’’ ( Son of India ) ను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ఆయన టైటిల్ ‘సన్నాఫ్ ఇండియా’తోపాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ (Son of India poster ) ను విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Also read: Keerthy Suresh: ఆకట్టుకుంటున్న ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్

సన్నాఫ్ ఇండియా టైటిల్‌ను చూస్తుంటే.. దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ చిత్రంలో నటిస్తున్న తారగణం గురించి స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే.. దీంతోపాటు మోహన్‌బాబు సూర్య హీరోగా నటిస్తోన్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో ఎయర్‌ఫోర్స్ అధికారి పాత్రలో నటిస్తున్నారు.   Also read: Patriotic songs: దేశ భక్తిని తట్టిలేపే టాప్ 10 బాలీవుడ్ పేట్రియాటిక్ సాంగ్స్

Read More