Home> వినోదం
Advertisement

Kannappa Movie Update: కన్నప్పకు దొరికేసిన హీరోయిన్.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే?

Kannappa Update: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాలో ఓ మోడల్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. 
 

Kannappa Movie Update: కన్నప్పకు దొరికేసిన హీరోయిన్.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే?

Kannappa Heroine: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు 'కన్నప్ప'(Kannappa Movie). ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో పెద్ద పెద్ద స్టార్లు నటిస్తున్నారు. విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో ఇప్పటి వరకు హీరోయిన్ సెట్ అవ్వలేదు. మెుదట్లో నుపుర్ సనన్ తీసుకున్నప్పటికీ.. డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. 

తాజాగా కన్నప్పకు కథానాయిక దొరికేసిందట. మంచు విష్ణు సరసన మోడల్ ప్రీతి ముకుందన్(Preity Mukundan)ను ఫీమేల్ లీడ్ గా తీసుకుందట చిత్రయూనిట్. ఆమెకు ఎన్నో ఆడిషన్స్ నిర్వహించిన తర్వాత కన్ఫామ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ మెుత్తం న్యూజిలాండ్‌లో ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయనున్నారట మేకర్స్. హైలెవల్ బడ్జెట్ తో ఈ మూవీని మోహన్‌ బాబు (Mohan Babu) నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రీతి ముకుందన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. భరతనాట్య కళాకారిణిగా మంచి పేరు ఉంది. చాలా యాడ్స్‌కు మోడల్‌గా కూడా చేసింది. కన్నప్ప’లోని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటుగా ఆమె నృత్యం కూడా ప్రేక్షకులను కనువిందు చేయనుందట. ''ఈ పాత్రకు ప్రీతి సరిగ్గా సరిపోతుంది. ఆమెతో కలిసి టీం అంతా పనిచేయడానికి రెడీగా ఉంది అంటూ'' కన్నప్ప డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉంటే, కన్నప్ప సినిమాలో ప్రభాస్, నయనతార శివపార్వతుల్లా,  మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించబోతున్న సంగతి తెలిసిందే.  రీసెంట్ గా మోహన్‌ బాబు, శరత్‌ కుమార్‌లకు సంబంధించిన సీన్స్ కూడా చిత్రీకరించారు మేకర్స్.

Also Read: Naa Saamiranga Update: నాగార్జున 'నా సామిరంగ'లో అల్లరి హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More