Home> వినోదం
Advertisement

Mega Power : రామ్ చరణ్‌ బర్త్ డే.. చిరంజీవిపై మెగా పవర్ ఫస్ట్ లుక్.. ముందుకు వచ్చిన మెహర్ రమేష్‌, బాబీ

Mega Power First Look మెగా పవర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. నిన్న జరిగిన బర్త్ డే ఈవెంట్‌లో ఇలా బాబీ, మెహర్ రమేష్‌లు కలిసి మెగా పవర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

Mega Power : రామ్ చరణ్‌ బర్త్ డే.. చిరంజీవిపై మెగా పవర్ ఫస్ట్ లుక్.. ముందుకు వచ్చిన మెహర్ రమేష్‌, బాబీ

Mega Power First Look మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఆదివారమే మొదలయ్యాయ్ అన్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులంతా కలిసి నిన్న గ్రాండ్‌గా ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అయితే ఈ ఈవెంట్లో చిన్న సినిమాలను కూడా ప్రమోట్ చేశారు. అల్లు అరవింద్‌ ఆశీస్సులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నం.1గా  ‘మెగా పవర్‌’ చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. 

ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ కల్యాణ్‌, శశి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజును  పురస్కరించుకుని దర్శకులు మెహర్‌ రమేష్‌, కె.ఎస్‌ రవీంద్ర (బాబీ) ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ .. రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవిగారి మీద ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశామని తెలిపారు. తాము అడగ్గానే బిజీ షెడ్యూల్‌లో ఉన్నా మెహర్‌ రమేశ్‌, బాబీ తమ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారని, అందుకే చాలా థాంక్స్ అని అన్నాడు. 

fallbacks

రామ్ చరణ్‌ పుట్టినరోజున మా సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోల సపోర్ట్‌తో ముందుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో మొదలైన తమ చిత్రం మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోందని తెలిపారు. మదర్‌ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అని, ఇది కచ్చితంగా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. మెగా హీరోల అభిమానులు అందరి సపోర్ట్‌ తమకు ఉంటుందని ఆశిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు.

Also Read:  RC 15 Title : రామ్ చరణ్‌కి నిజంగానే 'గేమ్ చేంజర్'.. కథ ఏంటో చెప్పేసిన శంకర్

Also Read: Ram Charan Birthday : రామ్ చరణ్‌లో నాకు నచ్చింది అదే.. నాగబాబు కామెంట్స్.. జన సైనికుల ఆకతాయి పనులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More