Home> వినోదం
Advertisement

Varun Tej - Lavanya Tripathi: ఘనంగా వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఫోటోలు వైరల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్తం పూర్తైన సంగతి తెలిసిందే! అయితే నిన్న శుక్రవారం రోజున వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ హాజరవ్వగా.. చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. 

Varun Tej - Lavanya Tripathi: ఘనంగా వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఫోటోలు వైరల్

Varun Tej - Lavanya Tripathi Pre Wedding Celebrations: మెగా వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. చిరంజీవి పవన్ ల సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రేమించుకున్న సంగతి.. కుటుంబ సభ్యులు సమ్మతించింది మరియు నిశ్చితార్థం కూడా జరిగిన సంగతి మన అందరికీ తెల్సిందే. 

ఇదిలా ఉండగా.. నిన్న శుక్రవారం వరుణ్ మరియు లావణ్యాల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగిందట.. అది స్వయంగా మెగాస్టర్ చిరంజీవి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఈ సెలబ్రేషన్స్ కూడా చిరంజీవి ఇంట్లోనే జరిగాయట. 

ఇక చవితి రోజు లావణ్య త్రిపాఠి నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్ తో పూజలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే! అపుడు కొత్త  కోడలు పెళ్లి కాకముందే అత్తారింట్లో హడావిడి చేస్తోందని వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పటి వరకు వీరి వివాహ మహోత్సవం ఎక్కడ జరుగుతుందో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు మెగా కుటుంబం నుండి అందరు హాజరవ్వగా మన జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కనపడలేదు. ఈ వేడుకకు అల్లు వారి కుటుంబం నుండి ఒక్క అల్లు శీరీష్ ఒక్కడే కనపడటం మనం చూడవచ్చు. 

Also Read: Muktinath Cable Car Project: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం.. కీలక ఒప్పందానికి ఆమోదం  

చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన ఫోటోలలో చిరంజీవి- సురేఖలతో పాటు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట ఉన్నారు. వీరితో పాటుగా చిరంజీవి చెల్లుల్లు.. వారు కుటుంబ సభ్యులు  మరియు  అల్లు శిరీష్, నిహారిక, సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు.  నాగబాబు కుటుంబంతో పాటుగా చిరంజీవి కూతుళ్లు.. వారి కూతుళ్లు కూడా ఫోటోలో ఉన్నారు. ఏదేమైనా ప్రీ వెడ్డింగ్ వేడుక చాలా ఘనంగా జరగగా.. వచ్చిన మెగా ఫ్యామిలీ సభ్యులు కాబోయే వధూవరులను దీవించారు. 

ఇటీవలే విడుదలైన వరుణ్ తేజ్ సినిమా గాండీవదారి అర్జున సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. ఇది వరకు వచ్చిన F3 కాస్త పరవాలేదు అనిపించిన.. గనీ సినిమా కూడా ఆకట్టుకోలేపోయింది. నిజానికి గత కొన్ని రోజులుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి హిట్ కోసం అయితే ఎదురుచూస్తున్నారు. 

Also Read: Poco F5 Pro Price: బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌లో POCO F5 5G మొబైల్‌పై రూ. 15,050 తగ్గింపు, త్వరపడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More