Home> వినోదం
Advertisement

Shankar Dada MBBS: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. శంకర్ దాదా మళ్లీ వచ్చేస్తున్నాడు..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ శంకర్‌ దాదా ఎంబీబీఎస్ మరోసారి ఆడియెన్స్ అలరించేందుకు సిద్దమైంది. ఈ మూవీ రీరిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. 
 

Shankar Dada MBBS: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. శంకర్ దాదా మళ్లీ వచ్చేస్తున్నాడు..

Shankar Dada MBBS Re-release: టాలీవుడ్ లో ఈ మధ్య రీరిలీజ్ ట్రెండ్ ఎక్కువైంది. గతంలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సినిమాలన్నీ ఇప్పుడు రీరిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా 7G బృందావన్ కాలనీ సినిమా కూడా థియేటర్లలో సందడి చేసింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ శంకర్‌ దాదా ఎంబీబీఎస్ (Shankar Dada Mbbs) కూడా రీరిలీజ్ కు రెడీ అయింది. నవంబర్ 4న గ్రాండ్‌గా ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్రకటించారు. 

ఈ సినిమాకు జయంత్ సి పరాంజీ దర్శకత్వం వ‌హించ‌గా.. పరుచూరి బ్రదర్స్ మాట‌లు అందించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ మూవీకి మంచి హైలెట్ అయింది. ఈ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ రీమేక్‌గా తెరకెక్కింది. 20 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తుంటే జనాలు పడిపడి చూస్తారు. ఇందులో చిరు, శ్రీకాంత్ కామెడీ ఓ రేంజ్ లో పడిందనే చెప్పాలి. ఇందులో చిరు సరసన సోనాలీ బింద్రే హీరోయిన్ గా నటించింది. 

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇందులో చిరు తన కామెడీతో మరోసారి మెస్మరైజ్ చేశాడు. ఇటీవల భోళాశంకర్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు చిరంజీవి. ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన ఈ మూవీలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం చిరంజీవి బింబిసార డైరెక్టర్ విశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో కూడా చిరు ఓ మూవీ చేయబోతున్నాడు. 

Also Read: Sai Dharam Tej Birth day: మాస్ అవతారంలో సాయిధరమ్ తేజ్.. 'గాంజా శంకర్‌' గ్లింప్స్‌ అదుర్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More