Home> వినోదం
Advertisement

Megastar Chiranjeevi: మెగాస్టార్ లూసిఫర్ దర్శకుడు అతడేనా ?

Lucifer Telugu Remake | ప్రస్తుతం తన కెరియర్ లో 2.0 ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాజకీయాల నుంచి దూరం వచ్చేసి వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.

Megastar Chiranjeevi: మెగాస్టార్ లూసిఫర్ దర్శకుడు అతడేనా ?

Lucifer Telugu Remake| మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరియర్ లో 2.0 ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాజకీయాల నుంచి దూరం వచ్చేసి వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ప్రస్తుతం కొరాటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యతో బిజీగా ఉన్న చిరంజీవి.. రెండు రీమేక్ మూవీలు కూడా చేయడానికి సిద్ధం అయిన విషయం తెలిసిందే. అందులో ఒకటి తమిళంలో హిట్ అయిన వెదళాం. 

Also Read | Women Empowerment: మహిళలకు గ్యారంటీ లేకుండా పదిలక్షల రుణం ఇచ్చే బ్యాంకు ఇదే!

చిరంజీవి ( Chiranjeevi) నటించనున్న ఈ చిత్రం తెలుగు వర్షన్ ను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. అయితే లూసిఫర్ విషయం ఏంటీ అనిది సస్పెన్స్ గా కొనసాగింది. అయితే దీనిపై కూడా క్లారిటీ వచ్చేసింది.

మలయాళంలో సక్సెస్ అయిన ఈ సినిమా తెలుగు రైట్స్ రామ్ చరణ్ ( Ram Charan) సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని సుజీత్, వి.వి.వినాయక్ డైరక్ట్ చేస్తారు అనుకున్నారు.. కాగా ఆ ఛాన్స్ మోహన్ రాజాకు దక్కింది అని సమాచారం.

Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత? 

నిజానికి రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే క్రేజీ ఛాన్స్ రావడం గ్రేట్ అనుకుంటున్నారు. లూసిఫర్ తరువాత రామ్ చరణ్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందిని తెలుస్తోంది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Read More