Home> వినోదం
Advertisement

Shyam Singha Roy: నానితో కలిసి మీసం మెలేసిన చిరంజీవి.. ఇంటికి పిలిచి మరీ ఇచ్చేశాడుగా!!

Chiranjeevi watched Nani's Shyam Singha Roy Film. తాజాగా 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రాన్ని టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి వీక్షించారు. నానిని తమ ఇంటికి ఆహ్వానించిన మెగాస్టార్‌.. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.

Shyam Singha Roy: నానితో కలిసి మీసం మెలేసిన చిరంజీవి.. ఇంటికి పిలిచి మరీ ఇచ్చేశాడుగా!!

Chiranjeevi appreciates Nani's Shyam Singha Roy Film: 'నేచురల్ స్టార్' నాని (Nani) హీరోగా ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy). సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం గతేడాది క్రిస్మస్‌ సందర్భంగా (డిసెంబర్‌ 24) విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత బాక్సాఫీస్‌ వద్ద నాని భారీ హిట్ అందుకున్నారు. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయంతో మెప్పించారు. సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ నానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రాన్ని టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi  వీక్షించారు. అనంతరం చిత్ర బృందాన్ని అభినందించారు. ప్రత్యేకంగా నానిని తమ ఇంటికి ఆహ్వానించిన మెగాస్టార్‌.. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. 'నువ్వు దీని కంటే మరెన్నో ప్రశంసలకు అర్హుడివి' అని చిరు చెప్పగానే నాని ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నానితో చిరు సతీమణి సురేఖ కొంతసేపు ముచ్చటించారు. చిరు-సురేఖ దంపతులతో నాని టీ టైమ్‌ (Tea Time)ని ఎంజాయ్‌ చేశారు.

Also Read: World Dirtiest Man: 67 ఏళ్లుగా స్నానం చేయని మనిషి.. అతని ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు చూసి షాక్ తిన్న శాస్త్రవేత్తలు!!

దీనికి సంబంధించిన వీడియోని 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. అంతేకాదు నాని కూడా తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశాడు. తొలుత ఈ శ్యామ్ ఎవరికి నచ్చాడో కనిపెట్టండి? అంటూ ట్వీట్ చేసిన నాని.. ఆతర్వాత మెగాస్టార్ చిరుతో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని ఇద్దరూ మీసం మెలేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరోవైపు 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా శుక్రవారం (జనవరి 21) నుంచి ఓటీటీ (OTT) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఈ సినిమా అలరిస్తోంది. ఇటీవల నాని హీరో వచ్చిన 'టక్ జగదీష్' నిరచాపరిచినా.. 'శ్యామ్ సింగరాయ్' మాత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో నాని ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. 'బ్రోచేవారేవరురా; లాంటి చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న తాజా చిత్రం 'అంటే.. సుందరానికీ' (Ante Sundaraniki). ఈ సినిమాలో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) నటిస్తోంది.

Also Read: T20 World Cup 2022 Schedule: టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?! అభిమానులకు పండగే పో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More