Home> వినోదం
Advertisement

Chiranjeevi: దీపావళిరోజున మెగాస్టార్‌‌ కొత్త చిత్రం షూటింగ్

chiranjeevi new movie shooting : డైరెక్టర్స్ మెహర్‌ రమేష్‌, బాబీలతో చిరంజీవి మూవీలు చేయనున్నారు. ఇందులో బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న మూవీనే మొదట పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi: దీపావళిరోజున మెగాస్టార్‌‌ కొత్త చిత్రం షూటింగ్

Megastar chiranjeevi new movie shooting may start on deepavali: సినిమాల విషయంలో వేగం పెంచారు మెగాస్టార్‌‌ చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య మూవీ (Acharya Movie) రిలీజ్‌కు రెడీగా ఉంది. మరోవైపు గాడ్‌ ఫాదర్‌ (Godfather) మూవీ సెట్స్‌పై ముస్తాబవుతోంది. అలాగే డైరెక్టర్స్ మెహర్‌ రమేష్‌ (Mehr Ramesh) బాబీలతో (Bobby) చిరంజీవి మూవీలు చేయనున్నారు. ఇక ఇందులో బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న మూవీనే మొదట పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ దీపావళి సందర్భంగా నవంబరు 6న మెగాస్టార్ (Megastar) కొత్త మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. 

Also Read : Varudu Kavalenu trailer: ఆకట్టుకుంటున్న వరుడు కావలెను ట్రైలర్

ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని తెలుస్తోంది. మాస్‌ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీతో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. చిరు (Chiru) పుట్టినరోజున రిలీజైన ప్రీలుక్‌తో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక ఈ మూవీకి వాల్తేరు వాసుతో (Walther Vasu) పాటు పలు టైటిల్స్ అనుకుంటున్నారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.

Also Read : Pakistan top cricketers and their wives: తమ భార్యలతో కలిసి కెమెరాకు ఫోజిచ్చిన పాకిస్థాన్ టాప్ క్రికెటర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More