Home> వినోదం
Advertisement

IFFI Award: ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు చిరు అర్హుడే

IFFI Award: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవికి లభించిన అరుదైన గౌరవంతో నిజంగానే మెగాస్టార్ అన్పించుకున్నాడు. దేశం తరపున లభించే అరుదైన గౌరవమిది. 
 

IFFI Award: ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు చిరు అర్హుడే

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక ఐఎఫ్ఎఫ్ఐ ఇండియన్ ఫిల్మి పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించడం నిజంగా విశేషం. తెలుగు సినిమాలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా ఎదిగిన చిరంజీవి ఈ అవార్డుకు అర్హుడే.

పునాదిరాళ్లతో చిత్ర ప్రవేశం చేసిన చిరంజీవి అలియాస్ కొణిదెల శివశంకర వర ప్రసాద్.. 1982లో 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రంలో తన నటనతో జన హృదయాలను గెల్చుకున్నారు. ఫుల్ ఎనర్జీతో కూడిన ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలు, ఫైటింగ్ దృశ్యాల కారణంగా మెగాస్టార్ బిరుదు దక్కేలా చేసింది. 2006లో భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను పద్మభూషణ్‌తో సత్కరించారు. 

IFFI ప్రారంభోత్సవ వేదికపై కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్‌తో కలిసి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఈ అవార్డును ప్రకటించారు.  సినిమా, జనాదరణ పొందిన వ్యక్తిగా కొనియాడారు. సంస్కృతి సామాజికంగా కళామ్మతల్లికి  చేసిన కృషికి మెగాస్టార్‌కు ఈ అవార్డు దేశం ఇచ్చే గుర్తింపు అని ప్రముఖ నటుడిని అభినందించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాలపాటు నటుడిగా, నిర్మాతగా 150కు పైగా చిత్రాలతో అద్భుతమైన కెరీర్ కలిగి ఉన్నారని కీర్తించారు. అద్భుతమైన నటనతో ప్రజల హృదయాల్ని గెల్చుకున్నారని మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. 

గతంలో ఈ అవార్డ్‌ను వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీం ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమమాలిని, ప్రసూన్ జోషి వంటి సినీ ప్రముఖులు అందుకున్నారు. అద్భుతమైన నటనతో అశేషమైన అభిమానులను సొంతం చేసుకుని వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి గారు ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ - 2022’ అవార్డుకు ఎంపికవడం పట్ల హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Also read: Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎంపిక!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More