Home> వినోదం
Advertisement

Godfather fake Collections: చిరు నోట ఫేక్ లెక్కలా.. రామ్ చరణ్ మాటలేమయ్యాయి.. ఇలా అయితే ఎలా?

Megastar Chiranjeevi announcing fake Box office Collections for Godfather: మెగాస్టార్ చిరంజీవి నోటి వెంట ఫేక్ కలెక్షన్స్  రావడం ఇప్పుడు అందరికీ షాక్ కలిగిస్తోంది. ఈ విషయంలో రామ్ చరణ్ ను లాగి మరీ కోట చర్చకు దారి తీస్తోంది. ఆ వివరాలు 

Godfather fake Collections: చిరు నోట ఫేక్ లెక్కలా.. రామ్ చరణ్ మాటలేమయ్యాయి.. ఇలా అయితే ఎలా?

Megastar Chiranjeevi announcing fake Box office Collections for Godfather: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి ఆట నుంచి ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మోహన్ రాజా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ల విషయంలో వెనకబడిపోయిన సంగతి అందరికీ తెలిసినదే. ఒక పెద్ద హీరో సినిమాకి రావాల్సిన కలెక్షన్లు ఈ సినిమాకు ఏ మాత్రం రావడం లేదనేది ఎవరో కాదన లేని వాస్తవం.

అయితే సినిమాకి పాజిటివ్ టాక్ ఉండడంతో జనాల్ని థియేటర్లకు మాత్రం రప్పించే అవకాశాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో విడుదలైంది. సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడంతో అక్కడ కూడా మంచి రెస్పాన్స్ అయితే లభిస్తుంది. సినిమా తెలుగు నుంచి కంటే హిందీ ప్రేక్షకుల నుంచే ఎక్కువగా ఆదరణ దక్కించుకుంటుందని చెబుతున్నారు. సాధారణంగానే ఈ మధ్యకాలంలో నార్త్ ప్రేక్షకులు సౌత్ సినిమాలకు ఆకర్షితులవుతున్నారు, దానికి తోడు సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారు.  

తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మెగాస్టార్ చిరంజీవి హిందీలో 600 స్క్రీన్ ల పెంచుతున్నామని ఈ రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందంటూ ఒక వీడియో విడుదల చేశారు. అంతేగాక ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లోనే సినిమా 69 కోట్ల రెవెన్యూ దాటేసిందని పేర్కొన్నారు. అయితే సినిమా రెండు రోజుల్లో 69 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటింది అని చిరంజీవి చెప్పారు అనుకుందాం, కానీ వాస్తవానికి చూస్తే కేవలం 45 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే సినిమా రెండు రోజుల్లో కలెక్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి మాటలను బట్టి ఏకంగా పాతిక కోట్ల రూపాయలను ఆయన పెంచి చెప్పినట్లుగా ట్రోల్స్ మొదలయ్యాయి.

అయితే సినిమాలకు నిర్మాతలో లేక పీఆర్ టీమో ఇలా కలెక్షన్లను పెంచి చెప్పింది అంటే సినిమా హైప్ పెంచుకోవడానికి అనుకోవచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక సీనియర్ హీరో ఇలా కలెక్షన్లు పెంచి చెప్పడం కచ్చితంగా జనాల్లోకి నెగిటివ్ ఇంప్రెషన్స్ పంపుతుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇందులో మెగాస్టార్ తప్పేమీ లేదని నిర్మాతలు రాసిచ్చిన దాన్నే కదా ఆయన చదువుతారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాత కూడా రామ్ చరణే. రాంచరణ్ గతంలోని ఇలాంటి వ్యవహారాల మీద కాస్త తెలివిగా స్పందించారు. కానీ ఇప్పుడు ఆయన నిర్మాణంలోనే రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా విషయంలో మాత్రం తన తండ్రి ఇలా ఫేక్ కలెక్షన్స్ చెబుతుంటే ఆయన ఏమీ మాట్లాడటం లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.

గతంలో ఒక సినిమా ప్రమోషన్స్ సమయంలో తాను ఇలా కలెక్షన్లను ప్రకటించే విషయంలో వ్యతిరేకం అని తన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏ సినిమా వచ్చినా అలా ప్రకటించమని, అలాగే తాను నటించే సినిమాల కలెక్షన్స్ కూడా ప్రకటించకుండా చూసుకుంటానని రామ్ చరణ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాకు తన తండ్రి ఫేక్ కలెక్షన్స్ చెబుతుంటే ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే మెగా అభిమానులు మాత్రం మెగాస్టార్ కి అండగా నిలబడుతూ వాళ్ళందరికీ గట్టిగా కౌంటర్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనుకోండి అది వేరే విషయం.

Also Read: Shetty 's Films in Kannada: కన్నడ నాట 'శెట్టి'లదే హవా.. ఏకంగా ఏడాదిలో మూడు సూపర్ హిట్లు!

Also Read: Adipursh Court Case: ఆదిపురుష్ కు మరో షాక్.. స్టే విధించాలంటూ హైకోర్టులో పిటిషన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More