Home> వినోదం
Advertisement

Tollywood: తెలుగుతెరపై త్వరలో పవన్, రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ సినిమా

Tollywood: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్, పవర్ స్టార్‌ల కుటుంబమది. ఇప్పుడా కుటుంబం నుంచి మరో క్రేజీ కాంబినేషన్ మూవీ సిద్ధంగా ఉంది.

 Tollywood: తెలుగుతెరపై త్వరలో పవన్, రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ సినిమా

Tollywood: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్, పవర్ స్టార్‌ల కుటుంబమది. ఇప్పుడా కుటుంబం నుంచి మరో క్రేజీ కాంబినేషన్ మూవీ సిద్ధంగా ఉంది.

మెగా అభిమానులు ఆనందించే వార్త ఇది. మెగాస్టార్ కుటుంబం నుంచి క్రేజీ కాంబినేషన్ త్వరలో రాబోతోంది. ఇప్పటికే ఆచార్య సినిమాతో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్య సినిమాతో చిరంజీవి, రామ్ చరణ్‌లు తొలిసారిగా ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. 

ప్రస్తుతం ఆచార్య సినిమా యూనిట్ ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉంది. వివిధ ఇంటర్వ్యూల్లో సినిమా గురించి వివరిస్తూ ఆచార్య సినిమా అంచనాలు పెంచుతున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరంజీవి కుటుంబానికున్న క్రేజ్ చాలా ప్రత్యేకమైంది. చిరు కుటుంబం నుంచి చాలామంది నటులు పరిచయమై..తెలుగు తెరపై సత్తా చాటుతున్నారు. అందులో  తనయుడు రామ్ చరణ్, తమ్ముడు పవన్ కళ్యాణ్, మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, నాగబాబు తనయుడు వరుణ్, అల్లు అర్జున్ ఇలా అందరూ సూపర్ స్టార్లే. ఇక తమ్మడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానుల్ని కలిగి ఉన్నాడు. 

ఇప్పుడు ఆచార్య సినిమా ప్రమోషన్ సందర్భంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్..ఓ గుడ్‌న్యూస్ అందించాడు. వెండితెరపై ఎప్పట్నించో నిరీక్షిస్తున్న కాంబినేషన్ త్వరలో రానుందని వెల్లడించి అందర్నీ ఆనందానికి గురి చేశాడు. త్వరలో బాబాయి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేస్తున్నానన్నాడు. ఆ సినిమాకు నిర్మాత కూడా తానేనన్నాడు. అయితే ఆ సినిమా కధేంటి, ఎప్పుడు షూటింగ్ ప్రారంభం కానుందనే వివరాలు మాత్రం ఇంకా అందలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ ఓ పాన్ ఇండియా సినిమాలో బిజిగా ఉన్నాడు. 

Also read: Kajal Aggarwal in Acharya: 'ఆచార్య' మూవీ టీజర్, ట్రైలర్ లలో కాజల్ అగర్వాల్ లేదేంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More