Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

రామ్‌గోపాల్‌వర్మ ఫైటింగ్ వీడియో వైరల్

రామ్‌గోపాల్‌వర్మ తాజాగా హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించిన తెలిసిందే.

రామ్‌గోపాల్‌వర్మ ఫైటింగ్ వీడియో వైరల్

రామ్‌గోపాల్‌వర్మ తాజాగా హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించిన తెలిసిందే. అయితే ఇదే లఘుచిత్రంపై ఇప్పటికే కొన్ని వేలమంది సోషల్ మీడియాలో నిరసనలు తెలియజేశారు. భారతీయ సంప్రదాయాలను ఖూనీ చేయడానికే వర్మ సంకల్పించాడని వారు వ్యతిరేకత కనబరిచారు. అయితే అంతే స్థాయిలో వర్మను  సమర్థించిన వారు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో పలు టీవీ ఛానల్స్‌లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు వర్మ. నగ్నత్వం అనే అంశంపై తన అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. అయితే ఆయన పై నిరసనల వెల్లువ తగ్గలేదు. కొన్ని మహిళా సంఘాలు వర్మను బహిరంగంగానే విమర్శించాయి. కొందరు వర్మను బండ బూతులు కూడా తిట్టారు. ఈ క్రమంలో ఈ రోజు తనపై నిరసన తెలుపుతున్న వారిని వర్మ చీల్చిచెండాడు... వారిపై చేయి చేసుకున్నాడు కూడా. నిజమే.. అని అనుకుంటున్నారా. అవును నిజమే.. తనపై నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై ఉన్న కోపానంతా కూడా సరదాగా కొందరు జూనియర్ ఆర్టిసులను రిక్రూట్ చేసుకొని వారిపై చూపించాడు వర్మ. నా ఊహలో నాపై నిరసన తెలిపిన వారిని ఊహించుకొని వీరిని కొడతున్నాను అని కూడా అన్నాడు వర్మ. ఫైట్ సీన్స్‌లో నటించే కొందరు ఆర్టిస్టులతో వర్మ చేసిన ఫైట్ వీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Read More