Home> వినోదం
Advertisement

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ Khiladiకి కరోనా దెబ్బ

Ravi Teja Khiladi Release Date: డిస్కో రాజా ఇచ్చిన ఉత్సాహంతో తన క్రాక్ చూపించిన తరువాత తాజాగా చేస్తున్న మరో ప్రయత్నం ఖిలాడి. క్రాక్ మూవీ సెట్స్‌పై ఉండగానే రవితేజ 67వ సినిమా ఖిలాడి మొదలుపెట్టాడు. కరోనా కారణంగా ఖిలాడి మూవీ విడుదల వాయిదా పడింది.

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ Khiladiకి కరోనా దెబ్బ

రాజా ది గ్రేట్ తరువాత టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ భిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. డిస్కో రాజా ఇచ్చిన ఉత్సాహంతో తన క్రాక్ చూపించిన రవితేజ(Actor Ravi Teja) తరువాత తాజాగా చేస్తున్న మరో ప్రయత్నం ఖిలాడి. క్రాక్ మూవీ సెట్స్‌పై ఉండగానే రవితేజ 67వ సినిమా ఖిలాడి మొదలుపెట్టాడు.

కరోనా లాక్‌డౌన్ అనంతరం ఖిలాడీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం థియేటర్లు, మల్టిప్లెక్స్‌లు నడిపే అవకాశం లేకపోవడంతో ఖిలాడిపై సైతం దాని ప్రభావం పడింది. రవితేజ(Ravi Teja) లేటెస్ట్ సినిమా ఖిలాడి విడుదల వాయిదా వేసినట్లు టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో వివరాలు పోస్ట్ చేశాడు. వీర ద‌ర్శకుడు ర‌మేష్ వ‌ర్మ (Ramesh Varma) దర్శకత్వంతో ఖిలాడి మూవీ తెరకెక్కింది. సత్యనారాయణ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read: Khiladi Teaser: మాస్ మహారాజ్ రవితేజ ‘ఖిలాడీ’ టీజర్ విడుదల, డ్యూయల్ రోల్ పోషించాడా

రవితేజ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) , డింపుల్ హయతి జత కట్టారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఖిలాడిలో ఓ కీలక పాత్రను యాంకర్‌, నటి అనసూయ పోషించింది. థ్రిల్లర్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ఉన్ని ముకుందన్‌ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాను వేసవి కానుకగా మే నెలలో తీసుకురావాలని భావించారు. కానీ కరోనా(CoronaVirus) కారణంగా ఖిలాడి విడుదల వాయిదా పడింది.

Also Read: Tollywoodలో మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన Anchor Anasuya, మూవీ యూనిట్ ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More