Home> వినోదం
Advertisement

Mangal Gochar 2023: త్వరలో కుజుడు పరివర్తనంలో మార్పు.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం..

Mangal Gochar 2023: గ్రహాల కమాండరైన కుజుడు త్వరలో రాశిని మార్చబోతున్నాడు. అంగారకుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
 

Mangal Gochar 2023: త్వరలో కుజుడు పరివర్తనంలో మార్పు.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం..

Mars Transit 2023 in october: ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. ధైర్యాన్ని ఇచ్చే కుజుడు త్వరలో తన రాశిని మార్చనున్నాడు. అక్టోబరు 22న కుజుడు కన్యారాశిని విడిచిపెట్టి తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. అంగారకుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. కుజుడు రాశి మార్పు వల్ల మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

కన్య రాశి
కుజుడు రాశి మార్పు కన్యారాశి వారికి మేలు చేస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది.
మేషరాశి
అంగారకుడి సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈరాశి యెుక్క ఏడో ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీంతో వీరికి వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో లాభం చేకూరుతుంది. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 
వృశ్చిక రాశి
ఈరాశికి అధిపతి అంగారకుడు. ఈ రాశి యెుక్క ఆదాయ గృహంలో కుజుడు సంచరించబోతున్నాడు. దీంతో ఈ రాశివారు మంచి ఫలితాలను పొందనున్నారు. ఈరాశి వారి ఆదాయం పెరుగుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది. పాత పెట్టుబడులు లాభిస్తాయి. మీరు ఊహించని లాభాలను పొందుతారు. రియల్ ఎస్టేట్ లో ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది. 

Also Read: Mercury retrograde 2023: ఈరోజు నుంచి 9 రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..లాభాలే లాభాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More