Home> వినోదం
Advertisement

Manu Charitra teaser: మను చరిత్ర.. ప్రేమలో పడటం అంటే ఏంటో తెలుసా ?

Manu Charitra teaser video: భరత్ పెదగాని రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రజెంట్ చేస్తుండగా.. ప్రొద్దుటూర్ టాకిస్ బ్యానర్‌పై నరాల శ్రీనివాస్ రెడ్డి, రోన్సన్ జోసెఫ్ నిర్మిస్తున్నారు.

Manu Charitra teaser: మను చరిత్ర.. ప్రేమలో పడటం అంటే ఏంటో తెలుసా ?

Manu Charitra teaser video: శివ కందుకూరి, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం మను చరిత్ర. ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాస్తవ్ ఇతర ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు. భరత్ పెదగాని రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రజెంట్ చేస్తుండగా.. ప్రొద్దుటూర్ టాకిస్ బ్యానర్‌పై నరాల శ్రీనివాస్ రెడ్డి, రోన్సన్ జోసెఫ్ నిర్మిస్తున్నారు. సుహాస్, ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగర్, మధు నందన్, హర్షిత చౌదరి, గరిమ కౌషల్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ప్రిఫేస్ ఆఫ్ మను చరిత్ర పేరిట మను చరిత్ర టీజర్‌ను విడుదల చేశారు. 

Also read : MAA Elections: సంచలనం రేపుతున్న పృథ్వీరాజ్‌ ఆడియో టేప్.. రసవత్తరంగా 'మా' ఎన్నికలు

ప్రిఫేస్ ఆఫ్ మను చరిత్ర వీడియో (Manu Charitra teaser) చూస్తే.. లవ్, యాక్షన్ కలగలిపిన చిత్రంగా మను చరిత్రను తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. ప్రేమలో పడటం అనేది కూడా ఒక తియ్యటి బాధలాంటిదే అనే క్యాప్షన్, టీజర్‌లో పెయిన్‌ఫుల్ దృశ్యాలు చూస్తోంటే.. ప్రేమికులను ఆకట్టుకునేలా చిత్రం ఉంటుందేమోనని నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

నిర్మాత రాజ్ కందుకూరి (Raj Kandukuri) తనయుడు శివ కందుకూరి హీరోగా తెరకెక్కుతున్న మను చరిత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే.. సినిమా ఆడియెన్స్ ముందుకొచ్చే వరకు వేచిచూడాల్సిందే.

Also read : Prabhas25: 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో ప్రభాస్ 25వ సినిమా ఫిక్స్..టైటిల్ ఏమిటంటే 

Also read : Glimpse of Ghani: గని ఫస్ట్ పంచ్ వీడియో.. Varun Tej పంచ్ పవర్

Also read : Kondapolam making video: అంచనాలు పెంచిన కొండపొలం మేకింగ్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More