Home> వినోదం
Advertisement

o Saathiya Title Song : మణిశర్మ రిలీజ్ చేసిన ఓ సాథియా.. నెట్టింట్లో వైరల్

o Saathiya Title Song ఓ సాథియా సినిమా కోసం మహిళా దర్శకురాలు, మహిళా నిర్మాతలు కలిసి పని చేస్తున్నారు. ప్రేమ కథతో రాబోతోన్న ఓ సాథియా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

o Saathiya Title Song :  మణిశర్మ రిలీజ్ చేసిన ఓ సాథియా.. నెట్టింట్లో వైరల్

o Saathiya Title Song లవ్ సాంగ్స్ ఎప్పుడూ యూత్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. సినిమాలోని పాటలు, అందులోనూ ప్రేమ పాటలు,మెలోడీ పాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి ఓ మెలోడీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్యూర్ లవ్ స్టోరీగా ఓ సాథియా అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్, లైడీ ప్రొడ్యూసర్లు కలిసి రూపొందిస్తున్నారు.

ఇలా మహిళా టెక్నీషియన్లతో నిర్మిస్తోన్న ఓ సాథియా మీద మంచి హైప్ ఏర్పడింది. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఓ సాథియా అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

రీసెంట్‌గా మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదగా రీసెంట్‌గా విడుదల చేసిన ఓ సాథియా టైటిల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. వన్ మిలియన్ వ్యూస్‌కు చేరువలో ఉన్న పాటలో.. భాస్కర భట్ల సాహిత్యం, విన్ను అందించిన బాణీ, జావెద్ అలీ గాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ సినిమా మీద ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ అయింది.

ఈజే వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్ చూస్తే సినిమాను ఎంత రిచ్‌గా తీశారో అర్థమవుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Also Read:  Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే

Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More